మిల్క్ బ్యూటీకి మ‌ళ్లీ మంచి రోజులు…?

Read Time: 1 minutes

మిల్క్ బ్యూటీ గా పేరుతెచ్చుకున్న త‌మ‌న్నా… అందానికి  అందం, న‌ట‌న‌కు న‌ట‌న‌. అందాలు ఆర‌బోయ‌టంలో… ఆ అందానికి త‌గిన‌ట్లు న‌టించ‌టంలో… ఆమెకు ఇండ‌స్ట్రీలో మంచి పేరే ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియా ఇండ‌స్ట్రీని    ఓద‌శ‌లో ఏలింది. కానీ త‌ర్వాత త‌ర్వాత  ప‌రిస్థితి మారిపోయింది.

ప్ర‌స్తుతం చేతిలో ఎలాంటి సినిమాలు లేక‌, ప్ర‌మోష‌న్ ఈవెంట్స్ లేక‌… ఖాళీగా ఉన్న అమ్మ‌డుకు ఇప్పుడు మ‌ళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. కోలీవుడ్ సుప‌ర్ స్టార్ విశాల్ స‌ర‌స‌న ఓ చిత్రంతో న‌టించ‌బోతుంది. అందాలు ఆర‌బోసే అవ‌కాశం ఉన్న చిత్రం కావ‌టం, న‌ట‌నకు ఆస్కారం ఉన్న చిత్రానికి ఆమెను ఎంపిక చేశారు. ఇప్ప‌టికే పందెంకోడి-2 తో స‌క్సెస్ సాధించి జోరు మీదున్న  విశాల్, మ‌రోసారి త‌మ‌న్నానే న‌మ్ముకున్నాడు. గ‌తంలో విశాల్ తో త‌మ‌న్నా ఓ సినిమా చేయ‌గా, ఇది రెండోది. ఇప్ప‌టికే సినిమా కు సంబందించిన స్క్రిప్ట్ వ‌ర్క్ న‌డుస్తోంద‌ని, త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పైకి వెళ్తుంద‌ట‌. సుంద‌ర్ పి ద‌ర్శ‌కత్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుండ‌గా… తెలుగులో కూడా మంచి మార్కేట్ ఉన్న విశాల్… ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇక సుంద‌ర్ ప్ర‌స్తుతం తెలుగులో ప‌వ‌న్ న‌టించిన అత్తారింటికి దారేది సినిమా రీమేక్ లో ఉన్నాడ‌ట‌.

అత్తారింటికి దారేది రీమేక్ పూర్త‌వ‌గానే… త‌మ‌న్నా మ‌రోసారి మెక‌ప్ వేసుకుంటుంద‌న్న మాట‌. రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్ట‌నున్న త‌మ‌న్నాకు… ఎలా క‌లిసివ‌స్తుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*