మెత్త‌బ‌డని నాయిని, కేసీఆర్ కు ముషీరాబాద్ టెన్ష‌న్

Read Time: 0 minutes

కేసీఆర్ ఎది చెప్తే… టీఆర్ఎస్ లో అదే ఫైన‌ల్. స‌హ‌జంగా ఏ ప్రాంతీయ పార్టీలో అయినా… ఇదే ఉంటుంది. కానీ, కొన్నిసంద‌ర్భాల్లో పార్టీలో, అద్య‌క్షుడితో స‌మ‌తూకంగా ఉండే నేత‌ల‌ను ప‌క్క‌న‌పెట్టే విష‌యంలో ఇబ్బంది, ఎం జ‌రుగుతుందో… బ‌య‌ట‌కు ఏం మెసెజ్ పోతుందో అన్న టెన్ష‌న్ ఉంటుంది. ప్ర‌స్తుతం కేసీఆర్ కూడా స‌రిగ్గా అలాంటి ప‌రిస్థితుల్లోనూ ఉన్నారు.

హోంమంత్రి నాయిని నర్సింహ‌రెడ్డి… అంటే తెలంగాణ‌లో తెలియ‌ని వారు లేరు. 1969 తెలంగాణ ఉద్య‌మంలో, మ‌లిద‌శ ఉద్య‌మంలో… కార్మిక నాయ‌కుడిగా ప్ర‌త్యేక గుర్తింపు ఉండేది. కాస్త వయ‌స్సు పై బ‌డ్డాక ప్ర‌భ కోల్పోతుండ‌టంతో… నాయినిని ప‌క్క‌న‌పెట్టే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు కేసీఆర్. 2014లో కేసీఆర్ ఆలోచ‌న‌కు ఒకే చెప్పినా, ఈసారి ముషీరాబాద్ సీటు త‌న అల్లుడు శ్రీ‌నివాస్ రెడ్డికి గట్టిగా ప‌ట్టుబ‌డుతున్నారు. మ‌రోవైపు ఎంపీ క‌విత త‌న అనుచ‌రుడు ముఠాగోపాల్ కోసం ప‌ట్టుబ‌డుతుండ‌టంతో… ఇన్ని రోజులుగా పెండింగ్ లో పెట్టారు. కానీ నామినేషన్లు చివ‌రి రోజుకు వ‌చ్చేయ‌టంతో… నాయిని బుజ్జ‌గించే ప‌నిలో ప‌డ్డారు కేసీఆర్. కానీ నాయిని ఒప్పుకోన‌ట్లు తెలుస్తోంది. దీంతో… ఏం చేయాలో అర్థం కాక‌, రేపు మ‌రోసారి మాట్లాడుదామ‌ని పంపించారు. గజ్వేల్ ఫాం హౌజ్ కు ఆదివారం మ‌ద్యాహ్నం ఆహ్వ‌నించారు. అయితే, ఎంపీ క‌విత ఒత్తిడితో… నాయిని టికెట్ ద‌క్కే అవ‌కాశం లేద‌ని, బుజ్జ‌గించే ప‌నిలోనే పిలిపిస్తున్నార‌ని నాయిని వ‌ర్గీయులు మండిప‌డుతున్నారు. ఉద్య‌మ‌కారున్ని ప‌క్క‌న పెట్టి, 2014లో పార్టీలో చేరిన వారికి టికెట్ ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో.. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ కే ఉన్న టెన్ష‌న్, ఇప్పుడు కేసీఆర్ కు, టీఆర్ఎస్ కూ ప‌ట్టుకుంది.

కోదాడ నుండి ఇటీవ‌లే పార్టీలో చేరిన బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్, ముషీరాబాద్ నుండి ముఠా గోపాల్ బ‌రిలో ఉండ‌బోతున్నారంటున్నాయి టీఆరెఎస్ వ‌ర్గాలు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*