మొన్న హైప‌ర్ ఆది, ఇప్పుడు అన‌సూయ‌… జ‌బ‌ర్ధ‌స్త్ నుండి ఔవుట్.

Read Time: 0 minutes

ఎప్పుడు ఎలా ఉంటుందో… ఎవ‌రూ చెప్ప‌లేరు. దీపం ఉండ‌గానే ఇళ్లు చ‌క్క‌పెట్టుకోవాలే అనే సామెత‌ను ఫాలో అవ‌టంలో సినిమా ఇండ‌స్ట్రీ త‌ర్వాతే ఎవ‌రైనా.  స్టార్ డ‌మ్ తీసుకొచ్చిన షో అయినా స‌రే, ఎదైనా స‌రే… రేప‌టి గురించి ఆలోచిస్తూన్న వారిలో అనసూయ కూడా చేరిపోయింది.

యాంక‌ర్ అన‌సూయ‌… పాపుల‌ర్ షో జ‌బ‌ర్ద‌స్త్ తో ఎంత పాపుల‌యిందో అందిరీకీ తెలుసు. కొన్ని యేండ్లుగా జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఆమె కూడా ఓ గెస్ట్ టైప్ అయిపోయారు. ఆమె అందం కూడా షోకు ఎక్స్ ట్రా అడ్వాంటేజ్. అయితే… ఈ మ‌ద్య అన‌సూయ‌కు సినిమా అవ‌కాశాలు పెరిగిపోయాయి. రంగ‌స్థ‌లంలో ఆమె క్యారెక్ట‌ర్ కు, న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌ర్ లో ఆమె ఇట్టే ఓరిగిపోయింది. దీంతో.. ఆమెకు మ‌రిన్ని చాన్సులు వ‌స్తుండ‌టం, అటు సినిమాల‌కు ఇటు జ‌బ‌ర్ద‌స్త్ షోకు డేట్స్ అడ్జేస్ట్ కాక‌పోవంతో… ఆమె జ‌బ‌ర్ధ‌స్త్ కు గుడ్ బై చెప్పేసిన‌ట్లే. ఇప్ప‌టికే ఎక్స్ ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ ను యాంక‌ర్ ర‌ష్మి కొట్టేయ‌గా, అనసూయ ప్లేస్ ను వ‌ర్షిని కొట్టేసింది.  మొదట్లో… అన‌సూయ ప్లేస్ లో వ‌ర్షినీని చూడ‌టం, ఊహించుకోవ‌టం అభిమానుల‌కు కాస్త క‌ఠినంగానే అనిపించినా… మెల్ల‌గా అల‌వాట‌యిపోతుంది.

ఇక పంచ్ ల‌తో క‌డుపు ప‌గిలేలా నవ్వించే… హైప‌ర్ ఆది కూడా డేట్స్ ప్రాబ్ల‌మ్స్ తో జ‌బ‌ర్ధ‌స్త్ షో నుండి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ఆది త‌ప్పుకున్న త‌ర్వాత‌… జ‌బ‌ర్ధ‌స్త్ క‌న్నా కూడా ఎక్స్ ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ షో బాగా పాపుల‌ర‌వుతోంద‌ని, రష్మీ అందాలు కూడా యాడవుతున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్.

ఈటీవీని రేటింగ్స్ లో తిరుగులేని స్థానంలో నిలబెట్టిన జ‌బ‌ర్ధ‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ షోల‌కు మెల్ల‌గా క్రేజ్ త‌గ్గుతోంద‌ని, ఇలా కీల‌క‌మైన వ్య‌క్తులు ఒక్కోక్క‌రుగా వెళ్లిపోవ‌టం ఇబ్బందే అంటున్నాయి మ‌ల్లేమాల ఎంటర్టైన్ మెంట్ వ‌ర్గాలు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*