మ‌ళ్లీ టార్గెట్ గా చంద్ర‌బాబు… కేసీఆర్ దూకుడు.

Read Time: 0 minutes

కేసీఆర్ మ‌ళ్లీ దూకుడు పెంచాడు. చంద్ర‌బాబు ను టార్గెట్ చేస్తూ, ఎన్నిక‌ల ప్ర‌చారంలో వేడిని పెంచాడు. టీడీపీ, కాంగ్రెస్ కు ప‌ట్టున్న స్థానాల్లో… చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ, చంద్ర‌బాబు వ‌ర్సెస్ కేసీఆర్ గా ప్ర‌చార ప‌ర్వాన్ని మార్చేస్తున్నాడు.

మ‌ళ్లీ మ‌నం చంద్ర‌బాబుకు, అమ‌రావ‌తికి బానిస‌ల‌మ‌వుదామా… చంద్ర‌బాబు మ‌న‌ల్ని వ‌ద‌ల‌బొమ్మాళీ అంటూ వ‌స్తున్నాడు, మ‌ళ్లీ ఆయ‌న‌కు ఎందుకు మనం ఓటేయాలంటూ ప్ర‌శ్నించారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో వ‌ల‌స‌లు బంద‌యిపోయాయ‌ని, ప్రాజెక్టులు పూర్త‌వుతున్నాయ‌ని… మ‌ళ్లీ వారికి ఓట్లేస్తే, మ‌ళ్లీ వ‌ల‌స‌లు మొద‌లు కావాల్సిందేనంటూ సెంటిమెంట్ ర‌గిలించే ప్ర‌య‌త్నానికి పూనుకున్నారు. చంద్ర‌బాబును బుజాల‌పై ఎక్కించుకొని కాంగ్రెస్ నేత‌లు ఊరేగుతున్నార‌ని మండిప‌డ్డారు.

సిద్దిపేట‌, దుబ్బాక‌, హుజుర్ న‌గ‌ర్ ఇలా… టీడీపీ ప్రాభ‌ల్యం లేని చోట, కేసీఆర్ కేవ‌లం అభివృద్ది ప‌థ‌కాల ప్రస్తావ‌న మాత్ర‌మే తెర‌పైకి తెస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం చేసేది చెప్తూ వెళ్లిన ఆయ‌న‌, టీడీపీ ఓటు బ్యాంకు ఉన్న చోట్ల ఖ‌మ్మం, మ‌హబూబ్ న‌గ‌ర్, న‌కిరేక‌ల్ లాంటి చోట్ల మాత్రం చంద్ర‌బాబుపై ఫైర్ అయ్యారు. దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు… కేసీఆర్ రెండు ర‌కాల వ్యూహాల‌తో, ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్నట్లు క‌న‌ప‌డుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే త‌ర‌హ ప్ర‌చారం ఉండే అవ‌కాశం క‌న‌ప‌డుతుండ‌గా, మొదటి విడుత ప్ర‌చారంలో జ‌రిగిన‌ట్లుగా…. చంద్ర‌బాబుపై అస‌భ్య‌క‌ర‌మైన మాట‌ల‌కు మాత్రం పోలింగ్ చివ‌రి వ‌ర‌కు పుల్ స్టాప్ పెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టికీ చంద్ర‌బాబుతో ఇబ్బందిఅనుకుంటే మాత్రం, మ‌ళ్లీ పాత ప‌ల్ల‌వే అందుకోనున్నారు గులాబీ బాస్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*