మ‌ళ్లీ ట్విట్ట‌ర్ వార్ కు దిగిన కేటీఆర్– ఉత్త‌మ్

Read Time: 1 minutes

ఎన్నిక‌ల ప్ర‌చారంలో… విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు కామ‌నే అయిన‌ప్ప‌టికీ, అన్నీ పార్టీల‌కు సోష‌ల్ మీడియా ప్ర‌చారం కూడా త‌ప్ప‌నిస‌రి అయిపోయింది. అయితే… ఇదే సోష‌ల్ మీడియా వేధిక‌గా కేటీఆర్, ఉత్త‌మ్ లు మ‌రోసారి ట్విట్ట‌ర్ వార్ కు దిగారు.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి. ప్ర‌చార ప‌ర్వం ముగింపుకు ద‌గ్గ‌ర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో… కేటీఆర్ ట్విట్ట‌ర్ వేధిక‌గా మ‌హ‌కూట‌మి పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాహుల్–చంద్ర‌బాబులు త‌మ ప్ర‌చారాన్ని ముగించుకొని బ‌స్ లో వెళ్తుంద‌డ‌గా, రాహుల్–చంద్ర‌బాబులు ముందుసీట్లో కూర్చుంటే, ఉత్త‌మ్ వెన‌క నిల్చున్న ఫోటో పెట్టి… మ‌హ‌కూట‌మి అధికారంలోకి వ‌స్తే ప‌రిస్థితి ఇలా ఉంట‌ది. కాంగ్రెస్ నేత‌ల‌కు వెన్నుముక‌, ఆత్మ‌గౌర‌వం లేదంటూ కామెంట్ చేశాడు. దీంతో… టీఆర్ఎస్ నేత‌లు త‌మ స్టైల్లో కామెంట్స్ చేస్తూ… రీ ట్వీట్స్ చేశారు.

అయితే, దీనిపై పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కూడా ఘాటుగానే స్పందించాడు. గ‌తంలో… మోడీ–కేసీఆర్ క‌లిసిన‌ప్పుడు… మోడీకి కేసీఆర్ వంగి వంగి న‌మ‌స్కారాలు పెట్టే ఫోటో పెట్టి, నాపై కామెంట్స్ చేసే ముందు మీ తండ్రి ప్ర‌దాని మోడీకి ఎలా స‌రెండ‌ర్ అయిపోయారో చూడు  అంటూ ఉత్త‌మ్ ట్వీట్ చేశాడు. దీంతో… ఇప్పుడీ ట్వీట్ వైర‌ల్ అవుతోండ‌గా, ఇటు కాంగ్రెస్ సోష‌ల్ మీడియా టీం, అటు టీఆర్ఎస్ టీంలు… ఎవ‌రి వారు త‌మ నేత‌ల ట్వీట్ల‌ను ప్రాచుర్యంలోకి తీసుకెళ్తున్నారు.

అయితే, ఉత్త‌మ్– కేటీఆర్ ల మ‌ద్య ఈ ట్విట్ట‌ర్ వార్ కొత్తేమీ కాదు. గ‌తంలో కూడా అనేక సార్లు… ట్విట్ట‌ర్ వేధిక‌గా, ముఖాముఖీ ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*