మ‌హ‌కూట‌మిలోకి మ‌రో పార్టీ, కీల‌క పార్టీ మ‌ద్ద‌తు.

Read Time: 0 minutes

కేసీఆర్ ఓట‌మే లక్ష్యంగా ఏర్ప‌డ్డ మ‌హ‌కూట‌మిలోకి మ‌రో పార్టీ చేరింది. ముస్లీం ఓట‌ర్లను ప్ర‌భావితం చేయ‌ల‌గ ఇండియ‌న్ ముస్లీం లీగ్ పార్టీ కూట‌మిలో చేరేందుకు ముందుకొచ్చింది. గాంధీబ‌వ‌న్ లో కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జీ ఖుంతియా తో ఆ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ భేటీ అయి, మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ముఖ్యంగా… గ్రేట‌ర్ లో ముస్లీం మైనారిటీ ఓటు బ్యాంకు పార్టీల గెలుపోట‌మల‌ను శాసిస్తుంది. అందుకే… కేసీఆర్ మిత్ర పార్టీగా ఎంఐఎంను ద‌గ్గ‌ర‌కు తీశారు. పేరుకు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీచేస్తున్నా… ఆ స్థానాల్లో బ‌ల‌హీన అబ్య‌ర్థుల‌ను నిల‌బెడుతున్నాం… అంటూ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. ఎంఐఎం కూడా టీఆర్ఎస్ వెంట ఉంటామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో… ఇప్ప‌టికే కొంద‌రు ముస్లీం మ‌త పెద్ద‌ల‌తో భేటీ అయినా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్… ముస్లీం  ఓట‌ర్ల బాగు కోసం, రిజర్వేష‌న్ల కోసం మ‌ద్ద‌తు కోరారు. ముస్లీం లీగ్ పార్టీ త‌మ‌తో ఉంటే… ఆ ఓట‌ర్ల‌ను కొంతైనా ప్ర‌భావితం చేయోచ్చు అనుకున్న కాంగ్రెస్ ఎత్తుగ‌డ ప‌నిచేసింది. కాంగ్రెస్ తో ఉన్న సంప్ర‌దాయ ముస్లీం ఓటు బ్యాంకుకు తోడు, ముస్లీంలీగ్ తో వ‌చ్చే ఓటింగ్ త‌మ‌కు కొన్ని స్థానాల్లో మంచి ఫ‌లితాలిస్తుంద‌ని కాంగ్రెస్ న‌మ్ముతోంది. అయితే… ముస్లీం లీగ్ పార్టీకి ఎంఐఎం అంతా ప్ర‌భావం చూప‌క‌పోయినా… ఎంబీటీ, ముస్లీం లీగ్ లాంటి చిన్న చిన్న పార్టీలు క‌లిస్తే… ఓవరాల్ గా త‌మ‌కు మంచే జ‌రుగుతుంద‌ని వారు భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేత‌లు ముఖ్యంగా ముస్లీం నాయ‌కులు తాజా ఎత్తుగ‌డ‌ల‌ను, లీగ్ చేరిక‌ల‌ను ఆనందంతో స్వాగ‌తిస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*