రంగంలోకి అధిష్టానం. అసంతృప్తులకు ముందే బుజ్జ‌గింపులు.

Read Time: 0 minutes

పార్టీ అబ్య‌ర్థులు ఫైన‌ల్ అయ్యాక‌, అబ్య‌ర్థుల లిస్ట్ బ‌య‌ట‌పెట్టాక కానీ… అసంతృప్తులు ఎవ‌రూ అనేది బ‌య‌ట‌ప‌డ‌దు. అప్పుడు కానీ… కొంతమందిని బుజ్జ‌గించ‌టం, మ‌రికొంద‌రి విష‌యంలో… చూసి,చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌టం అనేది మాములు. కానీ.. ఆమాత్రం చాన్స్ కూడా ఇవ్వ‌కుండా, కాంగ్రెస్ అధిష్టానం ముందే రంగంలోకి దిగింది.

కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ క‌మిటీ… అబ్య‌ర్థుల వ‌డ‌బోత‌పై దాదాపు 18 గంట‌లు డిల్లీ వార్ రూంలో వాడివేడి చ‌ర్చ న‌డిచింది. ఈ భేటీలో అబ్య‌ర్థులను ఎంపిక చేస్తూనే, టికెట్ కోసం చివ‌రి వ‌ర‌కు పోటిలో ఉన్న నేత‌ల‌ను కూడా అబ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు ముందే… బుజ్జ‌గిస్తోంది. అయితే, ఇది రాష్ట్ర స్థాయిలో కాకుండా… ఏకంగా డిల్లీకి పిలిపించుకొని, ఈసారి టికెట్ ఇవ్వ‌టం లేద‌ని…. పార్టీ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని స‌హ‌క‌రిస్తే, ఎమ్మెల్సీ ఇస్తాం అని కొంద‌రికి, నామినేటేడ్ ప‌దవుల‌ను ఇస్తాం అని మ‌రికొంద‌రికి నేరుగా అధిష్టానమే హ‌మీ ఇస్తోంది. ఇలా చివ‌రి వ‌ర‌కు టికెట్ రేసులో ఉండి, అసంతృప్తులుగా ఉన్న‌వారు దాదాపు 20వ‌ర‌కు ఉన్నార‌ని తెలుస్తోంది. దీంతో… అధిష్టానం రంగంలోకి దిగ‌క త‌ప్ప‌లేద‌ని, అసంతృప్తుల్లో మెజారిటీ నేత‌లు పార్టీలోనే ఉండేలా చూస్తోంది. కేసీఆర్ కు ఏమాత్రం చాన్సివ్వ‌కుండా, ఆయ‌న కాంగ్రెస్ అసంతృప్తుల‌కు గాలం వేసే అవ‌కాశం ఉంద‌న్న ఆలోచ‌న‌తోనే… ముందే కాంగ్రెస్ జాగ్ర‌త్త‌ప‌డ్డ‌ట్లుగా ఉందని రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఇక‌, కొన్ని సీట్ల విష‌యంలో… తాజాగా పార్టీలో చేరిన వారితో పాటు, ముందు నుండీ పార్టీలో ఉన్న‌వారు ఒకే సీటు కోసం పోటీప‌డుతుండ‌టంతోనే స‌మ‌స్య కాస్త జ‌ఠిలం అయింద‌ని, స్క్రీనింగ్ క‌మిటీలో పాల్గొన్న ఇద్ద‌రు కీల‌క రాష్ట్ర నాయ‌కుల మ‌ద్య వాగ్వాధాలు కూడా జ‌రిగాయని  తెలుస్తోంది. మొత్తంగా… కాంగ్రెస్ పార్టీ అబ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు, వ‌చ్చాక రెండు మూడు రోజుల పాటు… ఆశావాహుల త‌ల‌నొప్పులు పార్టీకి త‌ప్పేలా లేవు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*