రంగంలోకి ట్ర‌బుల్ షూట‌ర్స్, కాంగ్రెస్ అధిష్టానం కీల‌క నిర్ణ‌యం.

Read Time: 0 minutes

పొత్తులో భాగంగా సీటు ద‌క్క‌క కొంద‌రు, ఒకే పార్టీలో ఇద్ద‌రు బ‌ల‌మైన చోట సీటివ్వ‌టం  కుద‌ర‌క మ‌రొక‌రు… ఇలా అసంతృప్తితో ఉన్న నేత‌లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వీరికి టీఆర్ఎస్ గాలం వేసే ప‌రిస్థితి ఉండ‌టంతో… రంగంలోకి దిగింది కాంగ్రెస్ అధిష్టానం.

రాష్ట్రవ్యాప్తంగా… దాదాపు 40 మంది నేత‌లు పార్టీపై అల‌క‌బూనారు. అందులో… 20మందికి పైగా నేత‌లు గెలుపోట‌ముల‌ను డిసైడ్ చేసే స్థితిలో ఉన్నారు. దీంతో… కర్ణాట‌క ట్ర‌బుల్ షూట‌ర్, మంత్రి డీకే శివ‌కుమార్ తో పాటు, పుదుచ్చేరి సీఎం రంగంలోకి దింపింది కాంగ్రెస్. వెంట‌నే వారు కూడా ప‌ని మొద‌లుపెట్టారు. అసంతృప్త నేత‌ల‌కు నేరుగా ఫోన్ లో సంప్ర‌దిస్తూ, పిలిచుకొని స‌ర్ధిచెప్తున్నారు. అసంతృప్త నేత‌ల జాబితాతో పాటు, వారికి సంబందించి అన్నీ ర‌కాల స‌మాచారాన్ని ముందే వారికి అందించింది పీసీసీ.

పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు కృషి చేయాల‌ని, మీకు ఖ‌చ్చితంగా మంచి ప‌ద‌విని ఇచ్చి గౌర‌విస్తామ‌ని రాహుల్ త‌రుపున హ‌మీ ఇస్తున్నారు నేత‌లు. వారి వారి స్థాయిని బ‌ట్టి… కొంత‌మంది నేత‌ల‌కైతే, ఎమ్మెల్సీ , మంత్రిప‌ద‌వుల‌పై కూడా హ‌మీ ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌న‌కు 2014 నుండి ఖ‌మ్మం నుండి పోటీకి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్న ఎమ్మెల్సీ పొంగులేటికి… మ‌రోసారి ఎమ్మెల్సీతో పాటు, ఏఐసీసీలో కీల‌క ప‌ద‌వి ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక పార్టీ కోసం ప‌నిచేసి… టికెట్ ద‌క్కించులేక‌పోయిన వ‌రంగ‌ల్ డీసీసీ రాజేంద‌ర్ రెడ్డికి కూడా ఎమ్మెల్సీ ప‌ద‌వి ఆఫ‌ర్ చేశారు. పొత్తులో సీటు ఇవ్వ‌లేక‌పోయాం, కానీ మీరు కాంగ్రెస్ లో ఉండి… టీఆర్ఎస్ పై పోరాడారు. కేసుల పాలై, జైలుకు వెళ్లారు. మీ క‌ష్టం మాకు తెలుసు, మీకు ఖ‌చ్చితంగ న్యాయం చేస్తామ‌ని తెలిపార‌ట‌.  ఇలా క‌మిటీ.. ప‌ని అప్ప‌జెప్ప‌గానే, అసంతృప్తుల‌ను బుజ్జ‌గిస్తోంది.

ఈ ప‌ని కాస్త ముందు చేస్తే మ‌రింత బాగుండేద‌ని, అయినా… గ‌తానికి భిన్నంగా కాంగ్రెస్ అనుస‌రిస్తున్న తీరు అభినంద‌నీయమంటున్నారు నేత‌లు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*