రాజ‌యోగం కోసం కేసీఆర్ కొత్త యాగం.

Read Time: 0 minutes

ఎప్పుడూ స్వామీజీలు, హోమాలు, పూజ‌లు అంటూ, బాగా న‌మ్మే కేసీఆర్… వ‌చ్చే ఎన్నిక‌ల‌తో త‌న‌కు మ‌రోసారి రాజ‌యోగం సిద్దించాలంటే, యాగం చేయాల్సిందేన‌ని పండితులు చేసిన సూచ‌న మేర‌కు మ‌రో యాగం చేస్తున్నారు. రెండ్రోజుల పాటు ఈ యాగాలు సాగ‌నున్నాయి.

గ‌జ్వేల్ శివారులో ఎర్ర‌వ‌ల్లిలో ఉన్న త‌న ఫాం హౌజ్ లో కేసీఆర్  యాగం ప్రారంబించారు. విశాఖ పిఠాదిప‌తి…  స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తీ  చేతుల మీదుగా ఈ యాగం కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం రాజ‌శ్యామ‌ల‌ యాగం న‌డుస్తుండ‌గా… , రేపు చండీస‌హిత రుద్ర హోమం నిర్వ‌హించ‌బోతున్నారు.

గ‌తంలోనూ… ఇదే ఎర్రవ‌ల్లి ఫాంహౌజ్ లో కేసీఆర్ చండీయాగాన్ని ఘ‌నంగా నిర్వ‌హించి, బ‌హిరంగంగానే త‌న న‌మ్మ‌కాన్ని వెలిబుచ్చారు. కేసీఆర్ కు ఈ యాగాలు కొత్త‌కాదు. ఇటీవ‌ల త్రిదండీ చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో యాగం చేయించ‌గా, 2014కు ముందు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ జీతేంద‌ర్ రెడ్డి ఫాం హౌజ్ లోనూ యాగాలు నిర్వ‌హించారు. ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా, తాము అనుకున్న‌ది నేర‌వేరుతుంద‌నే భావ‌న‌తో… ఈ యాగాలు నిర్వ‌హిస్తారు అంటున్నారు పండితులు.

మంత్రాల‌కు చింత‌కాయాలు ఎంత‌వ‌ర‌కు రాలుతాయి అంటే ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో, ఈ యాగాలకు ఓట్లు రాలుతాయంటే కూడా అలాంటి స‌మాదాన‌మే వ‌స్తుంద‌ని, కాక‌పోతే ఎవ‌రి న‌మ్మ‌కం వారిది… అందులోనూ కేసీఆర్ లాంటి వారు ఇత‌రులు చెప్తే విన‌రు, ప‌ట్టించుకోరు అంటున్నారు పొలిటిక‌ల్ పండితులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*