రేవంత్ ఓట‌మికై… టీఆర్ఎస్ ముఖ్యుల ఆరాటం

Read Time: 0 minutes

ఇత‌ర చోట్ల ఓ సీటు అటు ఇటు అయినా ప‌ర్వాలేదు కానీ… రేవంత్ ను మాత్రం ఓడించి తీరాల‌న్న క‌సితో ఉంది టీఆర్ఎస్. ముఖ్యంగా… కేసీఆర్, కేటీఆర్ లు రేవంత్ ను మ‌ళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్ట‌నివ్వొద్ద‌న్న ప్ర‌ణాళిక‌తో వెళ్తున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. అందుకే, ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పెద్ద నేత‌లు కొడంగ‌ల్ వైపు క‌దులుతున్నారు.

మొన్న‌టి వ‌ర‌కు హ‌రీష్ రావు… కొడంగ‌ల్ లో చేరిక‌ల‌ను, అభివృద్ది అంశాన్ని ద‌గ్గ‌రుండి చూశారు. తాజాగా రేవంత్ త‌న నామినేష‌న్ వేసిన రోజు తీసిన ర్యాలీని త‌ల‌ద‌న్నెలా… కేటీఆర్ భారీ ర్యాలీ నిర్వ‌హించారు. కేసీఆర్ సూచ‌న‌ల‌తో ఆప‌రేష‌న్ కొడంగ‌ల్ ను ప్రారంబించిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఇత‌ర చోట్ల క‌న్నా ముందు నుండే కొడంగ‌ల్ లో ప్రచార ప‌ర్వం మొద‌లైంది. గెలుపు గుర్రం కోసం ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని దించారు. అయితే… తాజాగా కొడంగ‌ల్ ర్యాలీలో కేటీర్ ఆస‌క్తిక‌ర అంశాన్ని ప్ర‌క‌టించారు. మీకు అభివృద్ది కావాల‌న్నా, మీ జీవ‌న స్థితిగ‌తులు మెరుగుప‌డాల‌న్నా… టీఆర్ఎస్ తోనే సాధ్యం. అందుకోసం కొడంగ‌ల్ లో టీఆర్ఎస్ జెండా ఎగురేయండి… నేను కొడంగ‌ల్ ను ద‌త్త‌త తీసుకుంటా. ఆశీర్వ‌దించండి అంటూ అక్క‌డి ప్ర‌జ‌ల‌ను కోరారు. దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు రేవంత్ ను ఎంత‌లా టార్గెట్ చేశారో.

కొడంగ‌ల్ ఒక్క చోటే కాదు… కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లున్న చోట  ఇదే ఫార్మూల‌ను అప్లై చేయ‌బోతుంది టీఆర్ఎస్ పార్టీ. ముఖ్య నేత‌ల స్థానాల్లో వారికి ఇబ్బంది క‌లిగేలా ఒత్తిడి తేవ‌టం ద్వారా, వారిని త‌మ నియోజ‌క‌వ‌ర్గం దాటి రాకుండా చూస్తే చాలు మ‌నం గెలిచిన‌ట్లే అన్న ఆలోచ‌న‌లో ఉంది టీఆరెస్ అధిష్టానం. ఇప్ప‌టికే అందుకు సంబందిచిన ప‌నుల‌న్నీ చాప‌కింద నీరులా…  టీఆర్ఎస్ టీం చేస్తోందంటున్నారు నేత‌లు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*