రేవంత్ వ‌ర్గానికి చెక్, అడిగిన‌న్నీ సీట్ల‌కు అధిష్టానం నో.

Read Time: 0 minutes

టీడీపీలో ఉన్న‌ట్లు… కాంగ్రెస్ లోనూ ఉంటుంద‌నుకున్న రేవంత్ కు ఆయ‌న వ‌ర్గానికి కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం చెక్ పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న త‌నతో పాటు వ‌చ్చిన వారంద‌రికీ… టికెట్లు కోర‌టంతో, పార్టీ నో చెప్పింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

డిల్లీలో కాంగ్రెస్ పార్టీ త‌రుపున పోటీచేయ‌బోయే అబ్య‌ర్థుల వ‌డ‌పోత కార్య‌క్ర‌మం సాగుతోంది. వార్ రూంలో జ‌రుగుతోన్న ఈ  స్క్రీనింగ్ క‌మిటీ స‌మావేశానికి, అధిష్టాన పెద్ద‌ల‌తో పాటు…. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్, జానారెడ్డి స‌హా రేవంత్ త‌దిత‌రులు హ‌జ‌ర‌య్యారు. అయితే… ఒక్కో అబ్య‌ర్థి బ‌లాబ‌లాలు, ఆశావాహులు… ఎవ‌రికి గెలిచే అవ‌కాశం ఉంది, స‌ర్వేలో ఎలాంటి ప‌రిస్థితి ఉంద‌నే అంశాల‌పై సీరీయ‌స్ గా చ‌ర్చ సాగుతోంది. ముందుగా ఎస్సీ ఎస్టీ నియోజ‌వ‌ర్గాల వ‌డ‌పోత కొన‌సాగుతోన్న స‌మ‌యంలో…. రేవంత్ వ‌ర్గానికి చెందిన ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు నేత‌ల టికెట్ల విష‌యంలో… పార్టీ పెద్ద‌లు భిన్నంగా స్పందించారు. ఒక‌రికి టికెట్ నో చెప్ప‌టం, మ‌రోకరిని భ‌ద్రాచాలం పంపుదాం అని చెప్ప‌టంతో… రేవంత్ తీవ్ర అసంతృప్త‌ని వ్య‌క్తంచేసిన‌ట్లు తెలుస్తోంది. నాకు కేంద్ర హోంమంత్రితో మీటింగ్ ఉంది, నేను ఇక్క‌డ ఉన్నా… లాభం లేదు, నా సెక్యూరిటీ అంశం పై హోంశాఖ‌తో మాట్లాడాల్సి ఉంది అని చెప్పి రేవంత్ వెళ్లిపోయార‌ట‌.

దీంతో అక్క‌డున్న వారంతా… ఇలా అయితే ఎలా, అడ్డు అదుపు లేకుండా పోయింది, క‌డ్డ‌డిచేయాల్సిందేన‌ని కేంద్ర నాయ‌క‌త్వానికి వెంట‌నే ఫిర్యాదు చేశార‌ని స‌మాచారం.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*