వారంలో కేసీఆర్ వ‌రంగ‌ల్, ఖ‌మ్మం సభలు…

Read Time: 0 minutes

50రోజులు, 100స‌భ‌ల నినాదం ఇప్ప‌టికే ప‌క్క‌న పెట్టిన కేసీఆర్… 10రోజుల్లో రెండు స‌భ‌ల‌ను అటెండ్ చేయాల‌ని డిసైట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ లో స‌భ‌లు నిర్వ‌హించాల‌ని డిసైడ్ అవ్వ‌గా, ఖ‌మ్మం జిల్లా స‌భ‌కు జ‌న‌సమీక‌ర‌ణ‌పై తుమ్మ‌ల‌కు ఇంచార్జీగా వేశారు.

ఖ‌మ్మంలో గ‌తంలో ఒకే ఒక్క సీటు కొత్త‌గూడెంలో బోణి కొట్టిన టీఆర్ఎస్, త‌ర్వాత పాలేరును ద‌క్కించుకుంది. కానీ ఈసారి ఆ సంఖ్య‌ను భారీగా పెంచుకునే ఉద్దేశంలో ఉన్న కేసీఆర్… కాంగ్రెస్ సీనీయ‌ర్ నేత జ‌లగం ప్ర‌సాద్ రావు కు గాలం వేశారు. ఆయ‌న కూడా పార్టీ మారేందుకు మొగ్గుచూప‌టంతో… ఖమ్మం స‌భ‌కు వ‌చ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. ఇప్ప‌టికే ప‌లుసార్లు అనేక తేదీలు నిర్ణ‌యించ‌టం, వాయిదా ప‌డ‌టం మాములైపోయిన నేప‌థ్యంలో….ఖ‌మ్మం స‌భ పూర్త‌య్యేవ‌ర‌కు తుమ్మ‌ల‌ను ఖ‌మ్మం జిల్లా దాట్టొద్దంటూ ఆదేశాలు జారీ చేశార‌ట కేసీఆర్. ఇక ఖ‌మ్మం త‌ర్వాత వ‌రంగ‌ల్ స‌భ‌కు ప్లాన్ చేయాల‌ని మొద‌ట చెప్పినా… ఖ‌మ్మం స‌భ క‌న్నా ముందా వెన‌కా… అన్న‌దాంట్లో ఇంకా క్లారిటీకి రాలేద‌ని తెలుస్తోంది.

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాల్లో ఈసారి కాంగ్రెస్ భారీగా సీట్లు సాధిస్తుంద‌ని స‌ర్వేల‌న్నీ కోడైకూస్తున్న నేప‌థ్యంలో… కేసీఆర్ త‌న వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నా, ఏమైతుందో తెలియ‌ని గంద‌రగోళ ప‌రిస్థితుల నేప‌థ్యంలోనే… స‌భ‌లు వాయిదా ప‌డుతున్నాయ‌ని, ఏర్పాట్లు అంతా చేసుకున్నాక వాయిదా ప‌డ‌టం అలవాటుగా మారిపోయింద‌ని నిట్టూర్చుతున్నాయి టీఆర్ఎస్ వ‌ర్గాలు. ఈసారైనా ఉంటుందో లేదో చూడాలంటోంది టీఆరెఎస్ క్యాడ‌ర్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*