వాళ్ల‌ను సాటిస్ ఫై చేసేందుకేనా ఆమె ప్ర‌య‌త్నం

Read Time: 1 minutes

ఎంత పెద్ద హీరోయిన్ అయినా, ఎంత మంచి న‌ట‌న త‌న సొంత‌మైనా… సినిమా అంటేనే గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ. అందుకే… ఎంతో మంది హీరోయిన్ లు అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోతుంటారు. ఏ లాంగ్వేజ్ అయినా… ఎక్కువ కాలం ఉన్న వారు త‌క్కువ‌. ఈ మ‌ద్య అయితే… మ‌రీ ఈ టైప్ ఎక్కువై పోయారు. ఒక‌వేళ ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డాల‌న్నా… ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ అందాన్ని కొత్త చూపించాల్సిందే. తాజా ఈ నిజాన్ని తెలుసుకున్న ఓ బొద్దుగుమ్మ మ‌ళ్లీ ముద్దు, ముద్దుగా రెడీ అయిపోతుంది.

ఆ మ‌ద్య అనుష్క‌… మంచి ఫాంలో ఉండ‌గానే, బొద్దుగా ఓ సినిమా కోసం త‌యారైంది. కానీ మ‌ళ్లీ… స‌న్న‌బ‌డ‌లేదు. అంతే…. ఇండ‌స్ట్రీకి దూరమైపోయింది. అస‌లు బిల్లా సినిమా అనుష్క‌ను మ‌ళ్లీ ఎప్పుడు చూస్తామో… అంటూ కుర్ర‌కారు వెయిట్ చేస్తోంది.

Anushka2

Nithya

అయితే, అంత‌టి హైట్ లేకున్నా… త‌న అందంతో పాటు, మంచి న‌టిగా పేరు తెచ్చుకున్న బొద్దుగుమ్మ నిత్యామీన‌న్. ఎంతో లావైపోయినా… ఆమె మ‌ళ్లీ స‌న్న‌బ‌డేందుకు తెగ ట్రై చేస్తోంద‌ట‌. ఈ మ‌ద్య ఎన్ని సినిమాలు చేసినా, సినిమా హీట్–ప్లాప్ ల‌తో సంబందం లేకుండానే… కంటిన్యూ అయిపోతున్న ఈ కేర‌ళ కుట్టీ, స‌న్న‌బ‌డేందుకు వ‌ర్క‌వుట్స్ మొద‌లుపెట్టింద‌ట‌. ఆమె వెయిట్ త‌గ్గించుకోవాల‌న్న ఆలోచ‌న‌కూ ఓ కార‌ణం ఉందండోయ్… ఆమెకు ఓ బాలీవుడ్ ఆఫర్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. మిష‌న్ మంగ‌ళ్ అనే సినిమాలో చాన్స్ కొట్టేసిన నిత్యా…. ఆ సినిమా కోసం జిమ్ లో తెగ చెమ‌టోడ్చుతుంద‌ట‌. సౌత్ లో అంటే… సైజ్ లు అటు ఇటుగా ఉన్న ప‌ట్టించుకోరు కానీ, నార్త్ జ‌నం సైజ్ జీరోకు, అందాల మెజ‌ర్మెంట్ల‌కు ఎక్కువ ప్రిప‌రెన్స్ ఇస్తార‌ని… అందుకే అక్క‌డి జ‌నాల‌ను సాటిస్ ఫై చేయ‌డానికి సైజ్ జీరో ప్ర‌య‌త్నాన్ని కంటిన్యూ చేస్తొంద‌ట నిత్యా మీన‌న్.

రీసెంట్ గా రీలీజ్ అయిన ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బాల‌కృష్ణ‌తో…  గుండ‌మ్మ క‌థ పోస్ట‌ర్ లో మెరిసిన ఆమె, ఎంత‌మేర స‌న్న‌గా… నాజుగ్గా అవుతుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*