వెన‌క్కి తగ్గిన రెబెల్స్… ఊపీరీ పీల్చుకుంటున్న కాంగ్రెస్.

Read Time: 0 minutes

అసంతృప్త నేత‌లు, సీటు ద‌క్క‌ని నేత‌లు దుమ్మెత్తిపోత‌లు… ఇలా వారం, ప‌ది రోజులుగా కాంగ్రెస్ లో జ‌రిగిన ర‌చ్చ‌కు ఓ ముగింపు ప‌లికిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఏకంగా… ఏఐసీసీ నేత‌లే రంగంలోకి దిగ‌టంతో, అనుకున్న దానికన్నా హీజీగా వెన‌క్కితగ్గుతున్నారు రెబెల్స్.

జైరాం ర‌మేష్‌, చిదంబ‌రం, జైపాల్ రెడ్డి, వీర‌ప్ప‌మెయిలీ, డీకే శివ‌కుమార్ త‌దిత‌రులు రంగంలోకి దిగారు. వీరి ఇచ్చిన హ‌మీలు సంతృప్తి చెంద‌క‌పోతే… అప్పుడు చివ‌ర‌గా అహ్మ‌ద్ ప‌టేల్ ను ప్ర‌యోగిస్తున్నారు. క‌నీసం ఓ సారి ఎమ్మెల్యేగా గెల‌వ‌లేని వారి ఇంటికి కూడా… ఈ సీనీయ‌ర్ నేత‌లు స్వ‌యంగా వెళ్లి, పార్టీ ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకోవాల‌ని… రాబోయేది మ‌న ప్ర‌భుత్వ‌మే అని, మీకు ఎమ్మెల్సీ అవ‌కాశాలు ఉంటాయ‌ని బుజ్జ‌గిస్తున్నారు. కార్పోరేష‌న్ చైర్మ‌న్ పోస్టులు, మీ క్యాడ‌ర్ కు స‌ముచిత స్థానంతో పాటు….మీరు పార్టీకి చేసిన సేవ‌లు గుర్తుంచుకుంటామ‌ని చెప్ప‌టంతో… వారంతా వెన‌క్కిత‌గ్గుతున్నారు.

సూర్యాపేట నుండి రెబెల్ గా ఉంటాన‌ని ప్ర‌క‌టించిన ప‌టేల్ ర‌మేష్ రెడ్డి, మాజీ మంత్రి దామోద‌ర్ రెడ్డికి కుడిభుజంలా ప‌నిచేస్తాన‌ని అల‌క వీడారు. ప‌టేల్ ర‌మేష్ రెడ్డి కి న‌ల్గొండ ఎంపీగా అవ‌కాశం ఇస్తామ‌ని హ‌మీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

మేడ్చ‌ల్ నుండి బ‌రిలో ఉన్న జంగయ్య యాద‌వ్ ను జైరాం ర‌మేష్‌, శేరిలింగంపల్లి నుండి భిక్ష‌ప‌తి యాద‌వ్ ను జైపాల్ రెడ్డి, జైరాం ర‌మేష్‌లు బుజ్జ‌గించారు. దీంతో వీరంతా వెన‌క్కు త‌గ్గారు.

వ‌రంగ‌ల్ వెస్ట్ నుండి నాయిని రాజేంద‌ర్ రెడ్డి బ‌రి నుండి త‌ప్పుకున్నారు. చివ‌రి నిమిషం  వ‌ర‌కు ఒప్పుకోక‌పోవ‌టంతో… స్వయంగా అహ్మ‌ద్ ప‌టేల్ రంగంలోకి దిగి హ‌మీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

ఇలా ప్ర‌తి వ్య‌క్తిని క‌లిసి… పార్టీకోసం ప‌నిచేసేలా కాంగ్రెస్ అనుస‌రిస్తున్న కొత్త పంథా ఎంతో బాగుందని, రాహుల్ మార్క్ క‌న‌ప‌డుతోందంటున్నారు కాంగ్రెస్ నేత‌లు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*