వ‌రుస‌కు అన్నాచెళ్లేల్లు… ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్ధులు.

Read Time: 0 minutes

త‌మ్ముడు త‌మ్ముడే… పేకాట పేకాటే అన్నట్లుంది స్టేష‌న్ ఘ‌న్ పూర్ రాజకీయం. 2014 నుండి ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటున్న ఘ‌న్ పూర్… ఈసారి అదే త‌ర‌హా ఉండ‌బోతుంది. ఒకే పార్టీ నుండి అన్న‌ద‌మ్ములు, భార్య‌భర్త‌ల పోటీ చూస్తున్నాం.. కానీ ఇక్క‌డ రాజ‌య్య‌, ఆయ‌న బామ్మ‌ర్ధి భార్య ఇందిర పోటీలో ఉన్నారు.

నిజానికి.. ఘ‌న్ పూర్ టికెట్ పై చివ‌రి వ‌ర‌కు  అనేక ప‌రిణామాలు న‌డిచాయి. ఓ వైపు టీజెఎస్ టికెట్ ప‌ట్టుబ‌ట్టింది. ఆ త‌ర్వాత ఓయూ జెఎసీ నేత మాన‌వ‌త రాయ్ తో పాటు, మాజీ మంత్రి డా.విజ‌య‌రామారావు, రేవంత్ వ‌ర్గ‌పు నేత దొమ్మాటి సాంబ‌య్య గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించారు. కానీ… మాజీ ఉప ముఖ్య‌మంత్రికి అత్యంత స‌న్నిహిత వ్య‌క్తిగా గుర్తింపు పొందిన ఇందిర‌కే చివ‌ర‌కు టికెట్ ద‌క్క‌టంతో…. టీఆర్ఎస్ నుండి రాజ‌య్య‌, కాంగ్రెస్ నుండి ఇందిర‌లు రంగంలో ఉన్నారు.  దీంతో… ఘ‌న్ పూర్ ఫైట్ అంటే ఫ్యామిలీ ఫైట్ అన్న‌ట్లు త‌యారైంది.

అయితే, రాజ‌య్య‌పై అనేక లైంగిక ఆరోప‌ణ‌లు బ‌య‌ట‌కు వచ్చిన త‌రుణంలో… కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా మ‌హిళా అబ్య‌ర్థిని ఎంచుకొవ‌టం అంటే మంచి ఎత్తుగ‌డే అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌య్య‌పై చాలా వ్య‌తిరేక‌త ఉంది. ఆయ‌న సోంత పార్టీ నేత‌లే… రాజ‌య్య‌కు చివ‌రి నిమిషంలో హ్యండిస్తార‌న్న ప్ర‌చారం జోరుగా న‌డుస్తోంది. అందుకే… క‌డియం వ‌ర్గంతో రాజ‌య్య కాళ్ల‌భేరానికి వ‌చ్చినా, పూర్తిగా ఇద్ద‌రి గ్రూపులు క‌ల‌వ‌లేదు. పైగా అక్క‌డ టీఆర్ఎస్ నుండి అస‌మ్మ‌తి నేత రాజార‌పు ప్ర‌తాప్ భారీగా ఓట్లు చీల్చే అవ‌కాశం ఉంది. దీంతో… ఇందిరకు గెలుపు కొంత హీజీయే అన్న చ‌ర్చ ఘ‌న్ పూర్ లో జోరుగా వినిపిస్తోంది. పైగా ఇందిర వ్యాపార‌వేత్త‌. దీంతో… మంది మార్బ‌లంతో పాటు, ఆర్థికంగా మంచి నేత కావ‌టంతో ఆమె గెలుపుపై కాంగ్రెస్ వ‌ర్గాలు సంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*