శుక్రవారం సాయంత్రమే… క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

Read Time: 0 minutes

కాంగ్రెస్ లో టికెట్లు క‌న్ఫామ్ అయిపోయాయ‌ని కొంద‌రు, ఇదిగో అబ్య‌ర్థుల లిస్ట్ అని మ‌రికొంద‌రు చేస్తున్న ప్ర‌చారం పై క్లారిటీ ఇచ్చారు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్. ఇంకా చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని…. శుక్ర‌వారం సాయంత్రం వ‌ర‌కు వెయిట్ చేయండ‌ని స్ప‌ష్టం చేశారు.

డిల్లీలో కాంగ్రెస్ అబ్య‌ర్థుల వ‌డ‌బోత కార్య‌క్ర‌మం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. దాదాపు అన్నీ స్థానాల‌పై క్లారిటీ వ‌చ్చినా… 25సీట్ల‌పై ఇంకా ఇద్ద‌రు అబ్య‌ర్థులు ప‌ట్టుబ‌డుతున్నారు. దీంతో… ఆ ఇద్ద‌రిద్ద‌రు నేత‌ల‌తో కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడుతోంది. గురువారం సాయంత్రం సెంట్ర‌ల్ ఎల‌క్ష‌న్ క‌మిటీ మీటింగ్ లోపు ఈ ప్ర‌క్రియ పూర్తిచేయ‌నుండ‌గా, శుక్ర‌వారం సాయంత్రం కానీ… జాబితా విడుద‌ల‌య్యే ప‌రిస్థితి లేదు.  మేడ్చ‌ల్, సూర్యాపేట‌, తుంగ‌తుర్తి, న‌కిరేక‌ల్, మ‌క్త‌ల్, మునుగొడు లాంటి సీట్ల‌పై ఇంకా పేచి కోన‌సాగుతూనే ఉంది. దీంతో… శుక్ర‌వారం వ‌ర‌కు అస‌లైన జాబితా బ‌య‌ట‌కు వ‌చ్చేలా క‌న‌ప‌డ‌టం లేదు. మిర్యాల‌గూడ‌, మునుగోడు, రాజేంద‌ర్ న‌గ‌ర్, మ‌క్త‌ల్ స్థానాల్లో నేత‌ల వార‌సులు, బంధువుల‌కు టికెట్లు అడుగుతున్నందున‌… ఇవ్వాల వ‌ద్దా అనేది కూడా గురువారం ఫైన‌ల్ కానున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కులంతా… డిల్లీలోనే మకాం వేశారు. శుక్ర‌వారం అబ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు ముందు వీరంతా హైద్రాబాద్ చేరుకోనున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*