షో అంతా… చంద్ర‌బాబు, రాహుల్ దే

Read Time: 1 minutes

మ‌హ‌కూట‌మి పేరుతో… ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి అడుగుపెట్టిన చంద్ర‌బాబు–రాహుల్ గాంధీలు ప్ర‌చార వేగాన్ని పెంచ‌ట‌మే కాదు, ప్ర‌జ‌ల్లో కొత్త ఆలోచ‌న‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. చంద్ర‌బాబు వ‌స్తే, రాహుల్ తో స‌భ పంచుకుంటే జ‌నాలు ఎలా స్వీక‌రిస్తారో అన్న సందేహాలను ప‌టాపంచ‌లు చేస్తూ, ప్ర‌చార ప‌ర్వం మొద‌ల‌య్యాక మొద‌టి సారి మ‌హ‌కూట‌మి కేసీఆర్ ను త‌ల‌ద‌న్నే ప్ర‌చారం నిర్వ‌హించింది.

రాహుల్ వ‌స్తూ, వ‌స్తూనే కొడంగ‌ల్ స‌భ‌కు వెళ్ల‌టం, ఆ వెంట‌నే… చంద్ర‌బాబుతో క‌లిసి ఖ‌మ్మం మీటింగ్, ఆ త‌ర్వాత గ్రేట‌ర్ లో స‌న‌త్ న‌గ‌ర్, ఓల్డ్ సిటీలో ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఉద్య‌మ తెలంగాణ ఓట్లు ప‌డుతాయా… చంద్ర‌బాబు వ‌స్తే మ‌న‌కు మైన‌స్ అనుకున్న నేత‌లు, విశ్లేష‌కుల అంచ‌నాలు ప‌టాపంచ‌లు అయ్యాయి. చంద్ర‌బాబు కేసీఆర్ ను నేరుగా టార్గెట్ చేయ‌కుండా… ఇష్యూస్ ట‌చ్ చేయ‌టం, జైతెలంగాణ నినాదాలు క‌లిసిరాగా, ఖైమ్మంలో… గ‌ద్ద‌ర్, మందకృష్ణ‌ల మ‌ద్ద‌తు కూడా బూస్ట్ ఇచ్చేలా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఓవైపు రాహుల్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోన్న‌… కాంగ్రెస్ లో ఉత్త‌మ్, భ‌ట్టి మిన‌హా ఇత‌ర నేత‌లెవ‌రూ… రాహుల్ వెంట లేరు. స్టార్ క్యాంపెయినర్ విజ‌య‌శాంతి త‌న ప్ర‌చారంలో తానే మునిగిపోయారు. పెద్ద నేత‌లంతా త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కొడంగ‌ల్ స‌భ అనంత‌రం, రేవంత్ కూడా భువ‌న‌గిరి స‌భ‌కు వెళ్లిపోయారు. ఇలా… గ‌తానికి భిన్నంగా ఓవైపు కాంగ్రెస్ నేత‌ల సీరీయ‌స్ ప్ర‌చారం కొన‌సాగింది.

మ‌రోవైపు… కేసీఆర్ ఎన్ని స‌భ‌ల‌కు వెళ్తే, అన్ని స‌భ‌ల‌కు లైవ్ క‌వ‌రేజీ వ‌చ్చేది. కానీ బుధ‌వారం టీవీల‌న్నీ… రాహుల్ స‌భ‌కు, రాహుల్– చంద్ర‌బాబు స‌భ‌ల‌కే ప్రాధాన్య‌త ఇవ్వ‌టంతో… కేసీఆర్ ప్ర‌చారం చేసిందీ, ఎక్క‌డెక్క‌డకు వెళ్లార‌నే స‌మాచారం కూడా హైజాక్ అయిపోయింది.

బుధ‌వారం జ‌రిగిన‌ట్లుగా ప్ర‌చారం… ప్ర‌చార ప‌ర్వం ముగిసేలోపు మ‌రో నాలుగైదు సార్లు గ‌నుక చేయ‌టంలో మ‌హ‌కూట‌మి స‌క్సెస్ అయితే, విజ‌యం తథ్యం అన్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*