సీఎంపై ఆశ‌ల‌తోనే… రేవంత్ రెడ్డి.

Read Time: 0 minutes

కొంత‌కాలం క్రితం వ‌ర‌కు… సీఎం ప‌ద‌వి మ‌న‌కా… అనేవారు. కానీ ఇప్పుడు మ‌న‌కే అనుకుంటున్నారు. తొలిసారి ఎన్నికైనా ఎమ్మెల్యేనే కాదు,  నేను ఎమ్మెల్యే అయితే… సీఎం అవుతా అనుకునే వారూ ఉన్నారు. అలా త‌యారైంది సీఎం ఖుర్చీ ప‌రిస్థితి. ఇప్ప‌టికే… సీఎంలు ఎక్కువ‌య్యార‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి రేసులో ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.

మ‌హ‌కూట‌మి గెలుపు పై అవ‌కాశాలు… నేత‌ల‌కు కొత్త ఆశాల‌ను రేకేత్తిస్తోంది. అందులో ఇప్ప‌టికే చేరిన రేవంత్… ఆ త‌ర్వాత‌, కాస్త బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉంటూ వ‌చ్చినా, నేను నెం.2 పోజిషన్ లో ఉన్నాను అని ప‌దేప‌దే చెబుతుండ‌టం వెనుక అస‌లు మ‌ర్మ‌మేంటీ అన్న‌ది ఆయ‌న ప్ర‌త్య‌ర్ధులు లెక్క‌లు క‌డుతున్నారు. ఆయ‌న‌కు సీఎంపై ప‌దవి పై ఆశ ఉంద‌ని, అందుకే ఓ ర‌హ‌స్య ఎజెండాతో వెళ్తున్నార‌న్న వారు లేక‌పోలేదు. పైగా.. త‌న పాత గురువు చంద్ర‌బాబు పై ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. మ‌హ‌కూట‌మిలో.. టీడీపీ పాత్ర చాలా కీల‌కం. మ‌హ‌కూట‌మి గెలిచి, ప్ర‌భుత్వం ఏర్పాటులో టీడీపీ కీల‌క‌మైన ప‌రిస్థితుల్లో… చంద్ర‌బాబే కీల‌క‌మ‌ని, అప్పుడు రేవంత్ కూ అవ‌కాశాలున్న‌ట్లు ఆయ‌న వ‌ర్గీయులు అంచ‌నా వేస్తున్నారు. ఆ ప‌రిస్థితే గ‌నుక వ‌స్తే… ఇత‌ర నేత‌ల క‌న్నా ఎక్కువ చాన్స్ రేవంత్ కే ఉండే అవ‌కాశం ఉంద‌ని పొలిటికల్ ఎక్స‌పర్ట్స్ అంచ‌నావేస్తున్నారు. అందుకు… క‌ర్ణాట‌క ఎన్నిక‌లు, జెడీయ‌స్ నేత కుమార‌స్వామికి సీఎం ఖుర్చీ అప్ప‌గించ‌టం చూస్తే.. ఎదైనా సాధ్య‌మేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంది. తాజాగా జ‌రిగిన మీట్ ది ప్రెస్ కార్య‌క్ర‌మంలో కూడా రేవంత్ సూటిగా ఈ అంశంపై స‌మాధానం చెప్పకుండా… త‌న‌కు ప‌ద‌విపై ఆశ‌లు లేవంటూనే, పార్టీకోసం ప‌నిచేస్తూ ఉంటా అని చెబుతూనే… నేనేమీ చిన్న స్థానంలో లేన‌ని, పార్టీలో నెం.2 స్థానంలో ఉన్నాను అన్న విష‌యం మ‌ర్చిపోవ‌ద్ద‌ని చెప్పారు.  మ‌రోవైపు…  పార్టీలోని నేత‌లు ఎవరికి వారే… ఓవైపు గెలుపు కోసం ప్ర‌చారం చేసుకుంటూనే, ఖుర్చీపై కూడా క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది.

అయితే… గ‌త ఎన్నిక‌ల్లో లాగే, ఈసారి కూడా సీఎం పీఠంపై ప్రేమ‌తో పార్టీని గాలికి వ‌దిలేస్తే… మ‌రోసారి పార్టీకి ప‌రాభావం త‌ప్ప‌దంటున్నారు విశ్లేష‌కులు. ఎప్పుడు ఎదైనా జ‌ర‌గ‌టానికి అవ‌కాశం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*