సీపీఐని ఒప్పించే బాద్యత కోదండ‌రాంకు.

Read Time: 0 minutes

మ‌హ‌కూట‌మిలో సీట్ల పంచాయితీ… కొలిక్కి వ‌స్తున్నా, ఇంకా సీపీఐ పూర్తిస్థాయిలో అల‌క‌వీడ‌లేదు. దీంతో… వారిని కూట‌మి ప‌క్షాల‌న్నీ కాకుండా… సీపిఐని ఒప్పించే బాధ్య‌త‌ను టీజెఎస్ అద్య‌క్షుడు కోదండ‌రాంకు అప్ప‌గించారు.

వెంట‌నే రంగంలోకి దిగిన కోదండ‌రాం…. సీపీఐ కీల‌క నేత‌ల‌తో భేటీ అయ్యారు. సీపిఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట్ రెడ్డి, సీనీయ‌ర్ నేత నారాయ‌ణ‌ను క‌లిశారు. మ‌హ‌కూట‌మిలోని ఇత‌ర ప‌క్షాల‌న్నీ క‌లిపి… కోదండ‌రాం  ను దూత‌గా పంపిన‌ట్లు తెలుస్తోంది. సిపిఐకి ఇవ్వ‌జూపిన‌… మూడు అసెంబ్లీ సీట్ల‌తో పాటు, రెండు ఎమ్మెల్సీ సీట్ల‌కు ఒప్పించేందుకు కోదండారం వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అయితే, సీపీఐ నేత‌లు మాత్రం…. నాలుగు అసెంబ్లీ సీట్లు కావాల్సిందేన‌ని ప‌ట్టుబడుతున్న‌ట్లు తెలుస్తోంది. కావాలంటే… ఒక ఎమ్మెల్సీకి ఒప్పుకుంటాం అని వారు చెప్పారు. అయితే… సీపీఐ నేత‌లు పార్టీలో చ‌ర్చించి, నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పినా, ఇక తెగేదాకా లాగ‌కుండా… సిపిఐ కూడా ఒప్పుకునే అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లోనే అధికారికంగా… త‌మ అబ్య‌ర్థులతో కూడిన లిస్ట్ పంప‌నున్నారు.

సిపిఐ వ్య‌వ‌హ‌రం పూర్త‌యితే… మ‌హ‌కూట‌మి త‌రుపున సీట్ల ప్ర‌క‌ట‌న‌, అబ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌పై కూట‌మి త‌రుపున పేర్లు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాలంటున్నాయి. ఇప్ప‌టికే…. కాంగ్రెస్ అబ్య‌ర్థుల వ‌డ‌బోత, లిస్ట్ త‌యారుచేసే ప‌నిలో రెండ్రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం క‌స‌ర‌త్తులు ముమ్మ‌రం చేసింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*