సోనియాతో ట‌చ్ లో హ‌రీష్… సంచ‌ల‌నం

Read Time: 1 minutes

కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీష్ సోనియాగాంధీతో ట‌చ్ లో  ఉన్నారా…. స‌రైన స‌మ‌యంలో కేసీఆర్ కు బుద్ధిచెబుతారా…. కాంగ్రెస్ నాయ‌కుల మాట‌లు చూస్తుంటే నిజ‌మేనేమో అనిపించేలా ఉన్నాయి. గ‌జ్వేల్ లో కేసీఆర్ కు దీటుగా పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత ఓంటేరు వాఖ్య‌లు ఇప్పుడు గజ్వేల్ లో సంచ‌ల‌నం రేపుతున్నాయి.

కొంత‌కాలం క్రితం వ‌ర‌కు హ‌రీష్– కేటీఆర్ ల విబేధాలు తారాస్థాయికి చేరి, ఇప్పుడు కొంత స్త‌బ్ధుగా ఉన్నాయి. ఏ క్ష‌ణ‌మైనా… అవి మ‌ళ్లీ బ‌హిర్గ‌తం కావోచ్చు. కేసీఆర్ కూడా ఆ టైంలో కేటీఆర్ ప‌క్షాన ఉండ‌టంతో… హ‌రీష్ బాగా హ‌ర్ట్ అయ్యారు. పైగా కేసీఆర్ మీడియాలో హ‌రీష్ పై బ్యాన్ కొన‌సాగింది. దీంతో…. టీఆర్ఎస్ లో చీలిక త‌ప్ప‌ద‌ని అంతా భావించినా… త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో కేసీఆర్ జోక్యంతో వివాదం నివురుగ‌ప్పిన నిప్పులా రాచుకుంటూనే ఉంది.

అయితే… తాజాగా గ‌జ్వేల్ లో ప్రచారంలో భాగంగా… ఓంటేరు చేసిన ప్ర‌క‌ట‌నతో అంతా ఉలిక్కిప‌డ్డారు. మంత్రి హ‌రీష్ కూడా త్వ‌ర‌లో ఆ పార్టీకి రాజీనామా చేయ‌బోతున్నార‌ని, అతి త్వ‌ర‌లోనే ఆయ‌న కాంగ్రెస్ లో చేరుతార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే సోనియాగాంధీతో హ‌రీష్ రావు ట‌చ్ లో ఉన్నార‌ని… స‌రైన స‌మ‌యంలో ఆయ‌న టీఆర్ఎస్ నుండి బ‌య‌ట‌కు వ‌స్తార‌ని జోక్యం చెప్పారు. దీంతో టీఆర్ఎస్ వ‌ర్గాల్లోనూ, కాంగ్రెస్ నేత‌ల్లోనూ…. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే.. ఇదంతా ఎదో హైప్ కోస‌మ‌ని హ‌రీష్ వ‌ర్గం చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా, ఇటీవ‌లి ప‌రిణామాలు తెలిసిన వారంతా… పోయినా ఆశ్య‌ర్యం లేదంటున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*