స్టార్ హోట‌ల్లో ఆ హీరోయిన్ కోసం ప‌ర్మినెంట్ రూం బుక్ చేసిన ఆ హీరో.

Read Time: 0 minutes

బాలీవుడ్ అంద‌గాడు… స్టార్ హీరోయిన్ల ప్రేమ‌లో మునిగి తేలుతున్న హీరో ర‌ణ‌బీర్ క‌పూర్. దీపికా ప‌దుకొనే,క‌త్రినా కైఫ్ తో స్ట్రాంగ్ రిలేష‌న్ న‌డిపిన విష‌యం ప్ర‌పంచానికి అంతా తెలుసు. అయితే, మ‌రో స్టార్ హీరోయిన్ కోసం ర‌ణ‌బీర్ ఓ స్టార్ హోట‌ల్లో ప‌ర్మినెంట్ రూం బుక్ చేశాడ‌ట‌.

గ‌తంలో కూడా… క‌త్రినా కైఫ్ ర‌ణ‌బీర్ ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు కూడా ఓ ప్లాట్ రెడీ చెసుకున్నారు. క‌త్రినా ఆ ఫ్లాట్ ను ఎంతో ఇష్టంగా త‌న టేస్ట్ కు త‌గ్గ‌ట్లుగా డెక‌రేట్ చేసుకుంది. చాలా కాలం పాటు… ఇక్క‌డే ఈ ప్రేమ ప‌క్షులు టైంపాస్ చేశారు. కానీ త‌ర్వాత ప్రేమ వ్య‌వ‌హ‌రం పెళ్లి పీట‌లు ఎక్క‌కుండానే బెడిసికొట్టింది. దీంతో… ఎవ‌రి దారిన వారు వెళ్లిపోయారు. కానీ తాజాగా ర‌ణ‌వీర్ అలియా భ‌ట్ ప్రేమ‌లో ఉన్నాడు. ఇద్ద‌రూ కూడా బ‌హిరంగంగానే చ‌ట్టాప‌ట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. వీరి ఇద్ద‌రి కుటుంబ స‌భ్యుల మ‌ద్య  కూడా మంచి సాన్నిహిత్యం ఉండ‌టంతో… ఈసారి పెండ్లిపీట‌ల వ‌ర‌కు వెళ్తుంద‌ని న‌మ్ముతున్నారు. అయితే… గ‌తంలో క‌త్రినా చేసిన‌ట్లే… అలియాబ‌ట్ కోసం కూడా ఓ స్టార్ హోట‌ల్ లో రూం బుక్ చేశాడ‌ట ర‌ణ‌బీర్ క‌పూర్. అతి త్వ‌ర‌లోనే… ముంబైలోని ఈస్టార్ హోట‌ల్ కు మ‌కాం మార్చ‌బోతున్నార‌ని స‌మాచారం. భారీగా అద్దె చెల్లిస్తూ అక్కడే మకాం పెట్టారని సమాచారం. మరి ఈ రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుందో.. లేక ఎప్పటిలానే రణబీర్ బ్రేకప్ చెప్తాడో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*