స్టేష‌న్ ఘ‌న్ పూర్ టికెట్ కేటాయింపులో ఆయ‌న హ‌స్తం.

Read Time: 0 minutes

రాజ‌కీయాల్లో… ఎవ‌రు ఎలా క‌నెక్ట్ అవుతారో తెలియ‌దు. కాంగ్రెస్ లో టికెట్ల కేటాయింపులో భాగంగా… స్టేష‌న్ ఘ‌న్ పూర్ టికెట్ ఇందిర‌కు ఖాయం అయిన‌ట్లే. అయితే.. అనేక మంది ఈ టికెట్ కోసం పోటీలో ఉన్నా, రిజ‌ర్వ్డ్ నియోజ‌క‌వ‌ర్గం ఇందిర‌కు ద‌క్క‌టంలో ఎవ‌రు కీ రోల్….

స్టేష‌న్ ఘన్ పూర్ లో మాజీ మంత్రి విజ‌య‌రామారావు ఉన్నా, ఇందిర‌కు టికెట్ ఒకే అయిపోయింది. ఈ టికెట్ ద‌క్క‌టం వెనుక‌… పెద్ద‌క‌థే ఉంద‌న్న చ‌ర్చ సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. కాంగ్రెస్ లో ఎస్సీ సామాజిక వ‌ర్గం చెందిన ఒక పెద్ద నాయ‌కుడు మంత్రాంగం తోనే ఆమెకు టికెట్ ద‌క్కింద‌ని కాంగ్రెస్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. ఇందిర ఆ నాయ‌కుడితో చాలా స‌న్నిహితంగా ఉంటుంద‌ని, చాలా కాలంగా… స‌ద‌రు నేత‌తోనే ఆమె టికెట్ కోసం ప్ర‌య‌త్నించింద‌ట‌. ఒక్క విజ‌య‌రామ‌రావే కాదు… ఓయూ విద్యార్థి నేత‌లు కూడా… ఆ సీటు పై క‌న్నేశారు. త‌మ‌కే టికెట్ ద‌క్కుతుంద‌ని… ఫిక్స్ అయిపోయారు. కానీ… ఇందిర‌కే టికెట్ ద‌క్కింది.  ఆ నాయ‌కుడితో స‌న్నిహితంగా ఉండ‌టం, మొత్తం విష‌యం తెలిసిన స‌ద‌రు నేత భార్య ఇటీవ‌లే ఆయ‌న‌కు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఇత‌ర పార్టీలోకి కూడా వెళ్ళింది. కానీ… త‌న ప‌రువు పోతుంద‌న్న ఉద్దేశంతోనే ఆ లీడ‌ర్, బ్ర‌తిమాలి… ఒప్పించిన త‌ర్వాతే, మ‌ళ్లీ వెన‌క్కి వ‌చ్చింద‌ట‌. అలా చేస్తుంద‌ని స‌ద‌రు నేత‌కు అంతుచిక్క‌క‌పోగా, నన్ను ఎవ‌రూ అడిగేవారే లేరు అన్న ఉద్దేశంతో ఉన్న ఆ లీడ‌రు, త‌ర్వాత కాస్త మెత్త‌బ‌డ్డార‌ని టాక్ విన‌ప‌డుతోంది.

ఘ‌న్ పూర్ టికెట్ కోసం ప్ర‌య‌త్నించిన ఓయూ విద్యార్థి నేత మాన‌వ‌త‌రాయ్… చివ‌రి నిమిషంలో డ్రాప్ అయ్యారు. స్వ‌యంగా రాహుల్ గాంధీయే పిలిచి… భ‌విష్య‌త్ లో స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని, పార్టీ విజ‌యం కోసం ప‌నిచేయాల‌ని కోరార‌ట‌.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*