హీరోయిన్ క్యాథ‌రిన్, డైరెక్ట‌ర్ బోయ‌పాటి మ‌ద్య ప్ర‌త్యేక బంధం

Read Time: 0 minutes

డైరెక్ట‌ర్ల‌కు, హీరోయిన్ల‌కు మ‌ద్య ఉండే అవ‌గాహ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. స్టార్ డైరెక్ట‌ర్స్ విష‌యంలో హీరోయిన్స్ కూడా ప్లెక్సీబుల్ గా ఉంటారు. ఇప్పుడ‌దే లిస్ట్ లో చేరిపోయారు స్టార్ డైరెక్ట‌ర్ బోయపాటి.

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌నివాస్… కొంత‌మంది హీరోయిన్స్ ను స్పెష‌ల్ గా ట్రీట్ చేస్తుంటారు. అందులో ఒక‌రు…  హీరోయిన్ క్యాథ‌రిన్. ఈ మ‌ద్య క్యాథ‌రిన్ కు, బోయ‌పాటికి మ‌ద్య మంచి అండ‌ర్ స్టాడింగ్ వ‌చ్చేసింద‌ట‌. అందుకే ఆమెను స‌రైనోడు సినిమా నుండి… త‌న సినిమాలో ప్ర‌త్యేకంగా ఓ రోల్ ఇస్తూ వ‌స్తున్నాడు. స‌రైనోడు సినిమా నుండే… క్యాథ‌రిన్ కు గుర్తింపు వ‌చ్చింది. స‌రైనోడు త‌ర్వాత బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా  బోయ‌పాటి చేసిన సినిమా జ‌య జాన‌కి నాయ‌క సినిమాలో  కూడా క్యాథ‌రిన్ ఆడి పాడింది.

అయితే… ఇంత‌వ‌ర‌కు క్యాథ‌రిన్ ను ప్ర‌త్యేకంగా అయితే చూపించాడు, మంచి ఐటెం సాంగ్స్ లో చాన్సిచ్చాడు కానీ… మెయిన్ రోల్ లో, ఫ‌స్ట్ హీరోయిన్ చాన్స్ మాత్రం ఇవ్వ‌లేదు. అయితే… వ‌చ్చే సినిమాలో హీరోయిన్ చాన్స్ ద‌క్కుతుంద‌ని క్యాథ‌రిన్ కు చెప్పినా…. బోయ‌పాటి తాజా సినిమా విన‌య విధేయ రామ సినిమాలో కూడా హీరోయిన్ చాన్స్ ఇవ్వ‌లేద‌ట‌. ఈ సినిమాలో… కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోవ‌టంతో… క్యాథ‌రిన్ అల‌క వ‌హించింద‌ని తెలుస్తోంది.  కానీ ఈ సారి క్యాథ‌రిన్ కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ట బోయ‌పాటి. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం స్టార్ హీరోయిన్స్ ను తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. ర‌కుల్ ప్రీత్ సింగ్, కాజ‌ల్, త‌మ‌న్నా ఇలా చాలా మంది పేర్లు ముందుగా అనుకున్నా, నిర్మాతలు కూడా ఓకే అనేసినా… బోయ‌పాటి మాత్రం ఈ చాన్స్ ను క్యాథ‌రిన్ కు ఇచ్చార‌ట‌. చివ‌రి వ‌ర‌కు ఇలియానా పేరును కూడా ప‌రిశీలించినా, క్యాథ‌రిన్ కోసం ప‌ట్టుబ‌ట్టి మ‌రీ బోయ‌పాటి చాన్స్ ఇచ్చార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*