హుజుర్ న‌గ‌ర్ లో టీఆర్ఎస్ కు ఉల్టా షాక్.

Read Time: 1 minutes

అధికారం ఉన్న‌ప్పుడు అధికార పార్టీ నేత‌లు ఇచ్చిన షాక్ కు ఇప్పుడు ఉల్టా షాక్ లు త‌గులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌నాయ‌కులే టార్గెట్ గా కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లుపెట్టారు. ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వంతో పాటు, వీలైనంత మేర నాయ‌కుల‌ను పార్టీలోకి తెచ్చుకున్నారు.

కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. మ‌హ‌కూట‌మి టీఆర్ఎస్ కు దీటుగా పోరాడే అవ‌కావ‌శం ఉండ‌టం, ముఖ్య‌నేత‌ల‌కు మంచి ప‌ద‌వులు ద‌క్కే అవ‌కాశం ఉండ‌టంతో… పోయిన నేత‌లంతా తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా… పీసీసీ అద్య‌క్షుడు ఉత్తమ్ సొంత నియోజ‌క‌వ‌ర్గం హుజుర్ న‌గ‌ర్ లో పార్టీ విడిచిపోయిన వారంతా ఇప్పుడు మ‌ళ్లీ తిరిగి వ‌స్తున్నారు. టీఆర్ఎస్ కు చెందిన మూడు మండలాలు
మేళ్ల చెరువు,  చింత‌ల‌పాలేం, మ‌ఠంప‌ల్లి   అద్య‌క్షులు, ఈ మూడు మండ‌లాల ప‌రిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో మెజారిటీ నాయ‌కులు ఉత్త‌మ్ సమ‌క్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. బ‌ల‌మైన నేత‌ను…. ఉత్త‌మ్ పై పోటీచేయిస్తామంటూ ఇన్నాళ్లు చెప్పిన టీఆర్ఎస్ లో హుజుర్ న‌గ‌ర్ లో రెండు గ్రూపులున్నాయి. శంక‌రమ్మ‌-అప్పిరెడ్డి గ్రూపు ఒక‌టి కాగా, సైదిరెడ్డి గ్రూప్ మ‌రోక‌టి. దీంతో ఈ నాయ‌కుల‌ను న‌మ్ముకుంటే… కొట్టుకోవ‌టం త‌ప్పా, పార్టీ గెలిచేది లేదు అన్న అసంతృప్తిలో ఉన్నారు. పైగా… కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే… ఉత్త‌మ్ కు ముఖ్య‌ప‌ద‌వి ద‌క్క‌టం ఖాయం. దాంతో… హుజుర్ న‌గ‌ర్ లో టీఆర్ఎస్ పునాదులు పూర్తిగా క‌దులుతున్నాయి. ఈ నాలుగున్న‌రేండ్లలో ఏర్పాటు చేసుకున్న క్యాడ‌ర్ అంతా… ఒక్కోక్క‌రుగా కాంగ్రెస్ కు క్యూ క‌ట్టింది.

దీంతో… కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో ట‌ఫ్ ఫైట్ ఇద్దామ‌నుకున్న టీఆర్ఎస్ కు ఆదిలోనే గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*