హైద‌రాబాద్ కు దూరంగా మ‌కాం మారుస్తోన్న ర‌కుల్ ప్రీత్ సింగ్…?

Read Time: 0 minutes

తెలుగులో పెద్ద‌గా స‌క్సెస్ లేకున్నా, ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోన్న భామ ర‌కుల్ ప్రీత్ సింగ్. సినిమా ఫ‌ట్ అయితే… చాన్స్ లే రాని ఈ రోజుల్లో, ర‌కుల్… త‌న అంద‌చందాల‌తో టాలీవుడ్ లో బీజీగానే ఉన్నా, రాబోయేది క‌ష్ట‌కాల‌మేన‌ని గ్ర‌హించి, హైద‌రాబాద్ నుండి మ‌కాం మార్చే ప‌నిలో ప‌డిందంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు.

గ‌త ఏడాది ర‌కుల్ ఫుల్ బిజిలో ఉంది. తెలుగులో అనేక సినిమాల్లో న‌టిస్తూ, మోస్ట్ బీజీ భామ‌గా మారిపోయినా… ఈ మ‌ద్య తెలుగులో కూడా అవ‌కాశాలు మెల్లిగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇటు సినిమాల్లోనూ, అటూ బ‌య‌టా అనేక వివాదాల‌కు కేంద్ర‌బిందువైన ర‌కుల్, ఇక కోలీవుడ్ చిత్రాల‌పై దృష్టిసారించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ముఖ్యంగా మ‌హేష్ బాబుతో న‌టించిన స్పైడ‌ర్ సినిమా త‌ర్వాత‌, ర‌కుల్ అవ‌కాశాల గ్రాఫ్ డౌన్ ఫాల్ లోనే ఉంది. దీంతో… కోలీవుడ్ ఆఫ‌ర్ల‌కు అప్ప‌టి వ‌ర‌కు వెయిటింగ్ లిస్టులో పెట్టిన ర‌కుల్, వెంట‌వెంట‌నే కోలీవుడ్ సినిమాల‌కు ఓకే చెప్పేస్తుంది. అయితే… తెలుగులో త‌నకు అవ‌కాశాలు త‌గ్గినందుకే, కోలీవుడ్ కు వెళ్తుంద‌న్న వార్త‌ల‌ను మాత్రం ఖండిస్తోంది. తన‌కు తెలుగు ఎప్ప‌టికైనా పుట్టినిల్లేన‌ని, మంచి అవ‌కాశాలతోనే… కోలీవుడ్, బాలీవుడ్ వైపు వెళ్తున్న‌ట్లు చెప్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కు కొత్త సినిమా అవ‌కాశాలు లేకున్నా, తెలుగులో ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టిస్తోన్న ర‌కుల్, ఎన్టీయాఆర్ బ‌యోపిక్ లో కూడా ఓరోల్ చేస్తోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*