హ‌రీష్ భుజాల‌పై కోదండ‌రాంపైకి కేసీఆర్ తుపాకి.

Read Time: 0 minutes

కేసీఆర్ నేరుగా ఎప్పుడైనా కోదండ‌రాం ను తిట్టాడా… లేదు. ఎందుకంటే కోదండ‌రాం ను తిడితే వ‌చ్చే మైలేజి క‌న్నా… పోయే ప‌రువే ఎక్కువ‌గా ఉంటుంది. కేసీఆర్ తో స‌మానంగా తెలంగాణ ఉద్య‌మంలో కోదండ‌రాం ఊరురా తిరిగారు. అన్ని పార్టీల‌ను క‌ల‌ప‌టంలో ముందున్నారు. అందుకే కేసీఆర్ ఆ దైర్యం చేయ‌రు.

కానీ, కాంగ్రెస్ తో జ‌త‌క‌ట్టడం ద్వారా… కాంగ్రెస్ కూట‌మికి మ‌రింత ప్రజాధ‌ర‌ణ పెరిగింది.  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గా, కోట్లాడిన కోదండ‌రాం గా కొన్ని వ‌ర్గాల్లో సానుకూల‌త ఉండ‌టంతో… వారిని ఎదుర్కొనేందుకు కేసీఆర్ కొత్త ఆస్త్రాన్ని ప్ర‌యోగించారు. అదే హ‌రీష్ రావుఅస్త్రం.

నేరుగా కేసీఆర్ తిట్టి ప‌రువు పోగొట్టుకునే క‌న్నా, హ‌రీష్ బుజాల‌పై తుపాకి ఎక్కిపెట్టిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. అందుకే ఈ మ‌ద్య హ‌రీష్ కోదండ‌రాం టార్గెట్ గా మాట్లాడుతున్నారు.  చాన్స్ దొరికితే చాలు… కొదండరాం నాలుగు సీట్ల కోసం కాంగ్రెస్ పంచ‌న చేరారు, డిల్లీకి మోక‌రిల్లారు అంటూ… విమ‌ర్శిస్తున్నారు. అయితే… మొన్న‌టి వ‌ర‌కు తిట్ట‌డంలో ముందుండే యువ‌రాజు కేటీఆర్ మాత్రం అత్యంత ప‌రిపూర్ణ రాజ‌కీయ వేత్త‌లా మాట్లాడుతున్నారు. అంటే… కేటీఆర్ పై ఓ ముద్ర ప‌డ‌కుండా చూసుకోవ‌టంతో పాటు, కేసీఆర్ పై కూడా వ్య‌తిరేక‌త రాకుండా చూసుకుంటూనే, హ‌రీష్ కు పోగ‌పెడుతున్నార‌ని, హ‌రీష్ కూడా ఏం చేయ‌లేని స్థితిలో కూట‌మిని, కోదండరాం ను తిట్టిపోస్తున్నారంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*