12 నుండి ప్ర‌చారం, 11 న భీఫారాలు.

Read Time: 0 minutes

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో… ప్ర‌ధాన పార్టీల‌న్నీ సీరీయ‌స్ గా ప్ర‌చారం పై దృష్టిపెట్ట‌బోతున్నాయి. పండుగలు పూర్తికావ‌టం, అబ్య‌ర్థులు ఈలోపే ఫైన‌ల్ అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో….. టీఆర్ఎస్ రెండో విడుత ప్ర‌చారాన్ని ఈనెల 12 నుండి కేసీఆర్ ప్రారంభించ‌బోతున్నారు.

ఇప్ప‌టికే 50 రోజుల ప్ర‌చారాన్ని పూర్తిచేసిన టీఆర్ఎస్ అబ్య‌ర్థుల గెలుపుకోసం… గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగ‌బోతున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం… ఇప్ప‌టికే ఓ విడుత కేసీఆర్ ప్ర‌చారం పూర్తికావాల్సి ఉన్నా, మ‌హ‌కూట‌మి అబ్య‌ర్థుల విష‌యంలో క్లారిటీ లేక‌పోవ‌టంతో… ఇన్నాళ్లు ఆయన కూడా సైలెంట్ గా ఉన్నారు. కానీ టీఆర్ఎస్ అబ్య‌ర్థులు మాత్రం ప్ర‌చారంలో ఓరౌండ్ కంప్లీట్ చేసేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా 10 లేదా 11 తేదీల నుండి ప్ర‌చారానికి సిద్ధ‌మ‌వుతోన్న త‌రుణంలో…. కేసీఆర్ 12 నుండి ప్ర‌చారం మొద‌లుపెట్ట‌బోతున్నారు.

ఈలోపే… అబ్య‌ర్థులు ఇక హైద‌రాబాద్ కు రాకుండా ఉండాల‌ని, ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే మ‌కాం వేయాల‌ని ఇప్ప‌టికే ఆదేశాలు జారీచేయ‌గా, ఈ నెల 11న అబ్య‌ర్థుల‌కు భీ ఫారాలు కూడా ఇవ్వ‌బోతున్నారు. త‌ద్వారా… ప్ర‌చారంలో ఉన్న అబ్య‌ర్థుల మార్పు అంశానికి చెక్ పెట్టాల‌ని, క్యాండిడేట్స్ సైతం… ఇక ఎలాంటి భ‌యం లేకుండా ప్ర‌చారం చేసుకుంటార‌ని కేసీఆర్ విశ్వ‌సిస్తున్నారు. ఇక నామినేష‌న్ల అంశాన్ని పూర్తిగా అబ్య‌ర్థుల‌కే వ‌దిలేయ‌కుండా… టీఆరెస్ లీగ‌ల్ సెల్ త‌రుపున ప్ర‌తి అబ్య‌ర్థికి ఓ  లాయ‌ర్ ను అప్ప‌గించి, నామినేష‌న్ ప‌త్రాలు స‌రిగ్గా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

కేటీఆర్ కూడా ఈ నెల చివ‌ర్లో 24,25,26 తేదీల్లో గ్రేట‌ర్ లో ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించ‌గా, ప్ర‌చారం ముగిసే చివ‌రిరోజుల్లో… గ్రేట‌ర్ లో కేసీఆర్ ఓ భారీ బ‌హిరంగ స‌భ‌తో పాటు, ఇత‌ర స‌భ‌లను ప్లాన్ చేసింది టీఆరెఎస్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*