2014వ‌రకు గ్రాడ్యుయేట్, ఇప్పుడు ఇంట‌ర్మీడీయ‌ట్.

Read Time: 1 minutes

2014లో గ్రాడ్యుయేష‌న్ చేసిన వ్య‌క్తి… ఇప్పుడు ఇంట‌ర్మీడీయ‌ట్ ఎంటీ ?, ఎవ‌రైనా చిన్నోళ్లు చేసిన కొత్త ఫీటా అనుకుంటున్నారా…? అస్స‌లు కానే కాదు. మాల్కాజ్ గిరి నుండి టీఆర్ఎస్ అబ్య‌ర్థిగా పోటీప‌డుతున్న మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు. సీనీయ‌ర్ పోలిటీషీయ‌న్.

మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు… టీడీపీలో ఉండి, టీఆరెస్ ను, కేసీఆర్-హ‌రీష్ రావుల‌ను తిట్ట‌డంలో ముందుండే వాడు. 2014 ఎన్నిక‌ల ముందు పార్టీలో చేరి… మల్కాజ్ గిరి పార్ల‌మెంట్ నుండి పోటీచేసి కొద్ది తేడాతో ఓట‌మి పాల‌య్యారు. 2009లో పాత రామాయంపేట‌, ప్ర‌స్తుతం మెద‌క్ గా పిల‌వ‌బ‌డుతున్న అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక‌య్యారు. అయితే… ఈసారి ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న విద్యార్హ‌త‌ల అంశం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో, 2014 పార్ల‌మెంట్ కు పోటీచేసే స‌మ‌యంలో… ఆయ‌న దాఖ‌లు చేసిన ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో తాను గ్రాడ్యుయేష‌న్ పూర్తిచేసిన‌ట్లు తెలిపారు. అమెరికాలోని అల‌బామా యూనివ‌ర్శిటీ నుండి గ్రాడ్యుయేష‌న్ చేసిన‌ట్లు పేర్కొన‌గా, ఈసారి ఎన్నిక‌ల్లో మాత్రం త‌న విద్యార్హ‌త‌లు ఇంట‌ర్మీడీయ‌ట్ అని ఆఫిడ‌విట్ లో పేర్కొన్నారు. 1992లోనే డీగ్రీ పూర్తిచేసిన‌ట్లు గ‌తంలో చెప్పిన ఆయ‌న‌, ఉన్న‌ట్లుండి ఎందుకు త‌న విద్యార్హ‌త‌లు తానే త‌గ్గించుకున్నారు, ఇందులో ఏదైనా మ‌త‌ల‌బు ఉందా అన్న చ‌ర్చ ప్రారంబ‌మ‌యింది.

అయితే, ఆయ‌న ఇంత‌వ‌ర‌కు దీనిపై నోరు మెద‌ప‌టం లేదు. పొర‌పాటున అలా జ‌రిగిందా, లేక గ‌త ఎన్నిక‌ల అఫిడవిట్ త‌ప్పా అన్నది తేలాల్సి ఉండ‌గా… దీనిపై ఫిర్యాదు చేసేందుకు ప్ర‌త్య‌ర్థి పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈయ‌న పై మ‌హ‌కూట‌మి అబ్య‌ర్థిగా మాజీ ఎమ్మెల్సీ క‌పిల‌వాయి దీలీప్ కుమార్, ప్ర‌స్తుత బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు బ‌రిలో ఉన్నారు. చూడాలి మ‌రీ, ఎన్నిక‌ల సంఘం… మైనంప‌ల్లి విద్యార్హత‌ల అంశాన్ని ఎంత‌వ‌ర‌కు సీరీయ‌స్ గా తీసుకుంటుంది, తీసుకుంటే… నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ వ‌ర‌కు వెళ్తుందో లేదో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*