టీఆర్ఎస్ మ‌ళ్లీ వ‌స్తే… ఆర్టీసీ ప్రైవేటు ప‌ర‌మేనా…?

Read Time: 0 minutes

టీఆర్ఎస్ మ‌ళ్లీ రావాలి, కాదు.. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని జ‌నం, వివిధ సంఘాలు ఎవ‌రికి వారు త‌మ అభిప్రాయాన్ని చెబుతున్నా, ఆ ఉద్యోగులు మాత్రం… మ‌ళ్లీ టీఆర్ఎస్ రావ‌ద్దూ అంటూ వేడుకుంటున్నారు. వారే ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు.

రాష్ట్రంలో ఆర్టీసీ ఉప‌యోగం, ప్ర‌భావం ఎంత ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు 57000 మంది ఉద్యోగుల‌తో… 3687 రూట్ల‌లో సేవ‌లందిస్తోంది. మొత్తం 22000ల‌కు పైగా బ‌స్సుల‌తో, ప్ర‌తి రోజు ల‌క్ష‌న్న‌ర మందికి పైగా త‌మ గమ్య‌స్థానాల‌కు చేరుస్తోంది. ఇంత‌టి క్రీయశీల‌క సంస్థ‌కు తెలంగాణ ప్ర‌భుత్వంలో… పెద్ద‌గా ఓరిగిందేమీ లేదు. మొదట్లో… త‌ప్ప‌నిస‌రి పరిస్థితుల్లో 44శాతం ఫిట్ మెంట్ ఇచ్చినా, త‌ర్వాత‌… కనీసం వారికి త‌మ డిమాండ్ల సాధ‌నకు స‌మ్మె చేయ‌టానికి కూడా స్వ‌తంత్రం లేకుండా పోయింది.

నిజానికి… తెలంగాణ ఉద్య‌మంలోనూ, స‌క‌ల జ‌నుల స‌మ్మేలోనూ ఆర్టీసీ కార్మికుల ప‌ట్టు ఎంతో గొప్ప‌ది. వారి వ‌ల్లే అవి విజ‌య‌వంత‌మ‌య్యాయి. కానీ… కేసీఆర్ ఆర్టీసీపై చిన్న చూపు చూశార‌న్న‌ది ప్ర‌తి ఉద్యోగి ఆరోపిస్తున్నారు. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో అంత‌ర్భాగం చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను ప‌క్క‌న‌పెట్టార‌ని, లాభాలు లేవ‌న్న కార‌ణం చూపుతూ… తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ‌కు అన్యాయం చేసింద‌ని వారు వాపోతున్నారు. దీంతో… ఈసారి మ‌ళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తే, గ‌తంలో ఓసారి చెప్పిన‌ట్లే ప్రైవేటు ప‌రం చేస్తార‌ని ఉద్యోగులు భ‌య‌ప‌డుతున్నారు. అందేకే ఈసారి ఆర్టీసీ ఉద్యోగులంతా… త‌మ ఉద్యోగాలు ఉండాలన్నా, ఆర్టీసీ ప్రైవేటు ప‌రం కాకుండా ఉండాల‌న్నా… టీఆర్ఎస్ గ‌ద్దెదిగుతేనే సాధ్య‌మ‌ని భావిస్తున్నారు. పైగా… ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌ని కాంగ్రెస్ కూట‌మి కూడా హ‌మీ ఇవ్వ‌టం… ఉద్యోగుల అభిప్రాయానికి దోహ‌ద‌ప‌డుతుంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*