అగమ్యగోచరంగా మజ్లీస్ భవిష్యత్తు…. ?

Read Time: 1 minutes

మజ్లీస్ పరిస్థితి రేంటికి చెడ్డ రేవడిలా తయారుకానుందా…. ?  ఇన్నాళ్లు అధికార పార్టీలను వాడుకొని వదిలేసే అలవాటున్న ఎంఐఎo కె కేసీఆర్ ఉల్టా షాక్ ఇవ్వబోతున్నారా… ? ఇన్నాళ్లు ఇటు బీజేపీ, అటు మజ్లీస్ తో రెండు పడవల పై షికారు చేసిన కారు కు ఇప్పుడు ఒకే వైపు వెళ్లాల్సిన సమయం అసన్నమైనదా…? అంటే అవుననే సమాధానం వస్తోంది.

2004 నుండి అధికారంలో తే పార్టీ ఉన్నా, సీఎం ఖుర్చిలో ఎవరు కూర్చున్నా…. ఒల్డ్ సిటీ వరకు మజ్లీస్ ఎంత చెప్తే అంత. వారి కోరికలు తీర్చాల్సిందే. నాడు వైయస్ ఇచ్చిన సహకారంతో మజ్లీస్ అధికారాన్ని రుచి చూసింది. అంతకు ముందే చంద్రబాబు ఇచ్చిన చొరవతో మజ్లీస్ క్రమంగా పట్టుబిగించింది. అలా నిన్నటి వరకు….. ఆ ప్రయాణం సాగింది. కేసీఆర్ అందరికన్నా ఎక్కువగా నెత్తిన పెట్టుకున్నాడు. ముందస్తు ఎన్నికల్లో అవసరమైతే మద్దతు ఉండేలా చూసుకున్నాడు. కానీ పోలింగ్ అనంతరం పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అక్బర్ స్వరం మారుతోంది. ఇటు మజ్లీస్ తో సమానం గా బీజేపీ సీట్లు సాధిస్తుంది అని అంచనాకు రావటం తో కేసీఆర్ కు స్నేహ హస్తం ఇస్తోంది. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ స్థాయి నేతలు…. వరుసగా మేం టీఆరెస్ తో వెళ్లేందుకు సిద్ధం అని ప్రకటిస్తున్నారు.

అయితే టీఆరెస్ ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.  ఇప్పుడే బీజేపీ నేతల వ్యాఖ్యలకు ఏవిదంగా స్పందించిన ఫలితాలు కాస్త అటు ఇటు అయితే, మొదటికే మోసం వస్తుందన్న ఉద్దేశ్యంతో టీఆరెస్ నేతలు ఎవరూ పెదవి విప్పటం లేదు. ఇటు మజ్లీస్ కూడా టీఆరెస్, కేసీఆర్ ల ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తుంది. బీజేపీ, టీఆరెస్ లు ఒక్కటైతే…  అప్పుడు కాంగ్రెస్ కూటమిలో కలవడానికి కూడా వెనుకడొద్దన్న వ్యూహంలో మజ్లీస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు మజ్లీస్ అటు టీఆరెస్ రెండు పార్టీలు కూడా వెయిట్ అండ్ సీ అన్న ధోరణిలోనే ఉన్నాయి.

అయితే బిజెపి దూకుడే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత ముందే స్నేహ హస్తం వెనుక, ఎదో మతలబు ఉందని…. కూటమి అధికారంలోకి రాకుండా బీజేపీ వేస్తోన్న స్కెచ్ లా కనపడుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఒకే ఒరలో రెండు కత్తులు ఉండలేవు అన్నట్లు మజ్లీస్, బీజేపీని కలుపుకొని కేసీఆర్ వెళ్లగలడా, అలా చేస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి ఉత్తరాదిలో గట్టి ఎదురుదెబ్బ కాదా అన్న సమీకరణాలపై పలు ఊహాగానాలు, విశ్లేషణలు కొనసాగుతోన్నయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*