అది విష‌కౌగిలేనా…. ?

Read Time: 1 minutes

చంద్ర‌బాబుది విష కౌగిలా….? ఆయ‌న‌తో స్నేహం చేసి, విభేదించిన వారు తిట్టిన‌ట్లు అది విష‌కౌగిలేనా…? అంటే తెలంగాణ ఫ‌లితాలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌పై దృష్టిపెట్ట‌కుండా, సొంత‌గా త‌మ నాయ‌కుల‌ను కాకుండా… చంద్ర‌బాబు మంత్రాంగంతో క‌థ‌న‌డిపిన కాంగ్రెస్ అధిష్టానానికి, రాహుల్-చంద్ర‌బాబు కౌగిలి  విష‌కౌగిలే అని నిరూపితమైంది.

దేశ రాజ‌కీయాల పేరుతో… చంద్ర‌బాబు కాంగ్రెస్ తో జ‌త‌క‌ట్టి తెలంగాణ‌లోకి ప్ర‌వేశించారు. అక్క‌డే కేసీఆర్ స‌క్సెస్ అయిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. చంద్ర‌బాబు బూచీ మ‌రోసారి కేసీఆర్ రెండు చేతుల‌తో ఓడిసిప‌ట్టుకున్నాడు. చంద్ర‌బాబు గ‌డ్డం తెలంగాణ‌కు అడ్డం అంటూ… ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌జానీకం నినాదాలు చేశారు. కానీ అదే కేసీఆర్ ఎన్నిక‌ల కోసం చిర‌కాల ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ తో జ‌త‌క‌ట్ట‌డం విఫ‌ల ప్ర‌యోగంలా క‌న‌ప‌డుతోంది. అందుకే క‌నీసం గెలుపు ఆశలున్న సీట్ల‌లోనూ జ‌నం టీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు. మ‌హ‌కూట‌మి కి వ్య‌తిరేకంగా… సారు, కారు, స‌ర్కారు అన్న నినాదం టీఆర్ఎస్ కు వ‌ర్క‌వుట్ అయింది. టీడీపీతో జ‌త‌క‌ట్టిన బీజేపీ, అంత‌కు ముందు క‌మ్యునిస్టులు, మ‌జ్లిస్ ఇలా ఎవ‌రూ చంద్ర‌బాబును పూర్తిగా న‌మ్మ‌లేం అని చెప్పేవారే. అలాంటిది… తెలంగాణ సెంటిమెంట్ ను మ‌రోసారి కాంగ్రెస్ త‌క్కువ అంచ‌నా వేసింది. చంద్ర‌బాబు ప్ర‌చారం వ‌ద్ద‌ని కొంత‌మంది కాంగ్రెస్ నాయ‌కులు మొత్తుకున్నా,  ఎవ‌రూ విన‌లేద‌ని తెలుస్తోంది. అందుకే ఇలాంటి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని కాంగ్రెస్ శ్రేణ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

చంద్ర‌బాబు ఎవ‌రితో జ‌త‌క‌ట్టినా, అది చంద్ర‌బాబుకు మేలు జ‌రిగితే జ‌రుగుతుంది కానీ, మిత్ర‌ప‌క్షాల‌కు ఏమాత్రం లాభం ఉండ‌ద‌న్న అభిప్రాయం మ‌రోసారి నిజ‌మ‌యింది. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ వ‌చ్చాక కూడా టీడీపీ 15కు పైగా స్థానాలు గెలిచిందంటే బీజేపీ, మోడీ గాలి ప‌నిచేసింద‌ని భావించాలి కానీ కాంగ్రెస్ టీడీపీని ఎక్కువ‌గా అంచ‌నా వేసి టీడీపీ బ‌ల‌మ‌ని భావించి, పొర‌పాటు చేసింద‌న్న అబిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. టీడీపీ పై ఎక్కువ అంచ‌నాలు, చంద్ర‌బాబు ప్ర‌చారం కాంగ్రెస్ తుడిచిపెట్టుక‌పోవ‌టంలో క్రీయాశీల‌క పాత్ర పోషించిద‌న్న క‌న‌ప‌డుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*