అమ‌వాస్య నాడు కేసీఆర్ బ‌య‌ట‌కొచ్చేనా…?

Read Time: 0 minutes

కేసీఆర్ కు ఉన్న సెంటిమెంట్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. యాగాలు, పూజ‌లు… ఇలా కేసీఆర్ ఓ పెద్ద బ్ర‌హ్మ‌ణుడు అన్న వారూ ఉన్నారు. అందుకే మోడీ ఇటీవ‌లి త‌న తెలంగాణ ప్ర‌చారంలో… నిమ్మ‌కాయాల‌కు, మిర‌ప‌కాయాల‌కూ పూజ‌లు చేసే కేసీఆర్ అంటూ సంబోధించారు.

కేసీఆర్ కు ఉన్న సెంటిమెంట్స్ లో అమావాస్య సెంటిమెంట్ కూడా ఒక‌టి. ఆయ‌న అమావాస్య నాడు బ‌య‌ట‌కు అడుగుపెట్ట‌డు. అమావాస్య రోజు మంచిదికాద‌ని, ఏ ప‌ని చేసినా…. మంచి జ‌ర‌గ‌ద‌ని ఆయ‌న బ‌లంగా న‌మ్ముతాడు. కానీ… పోలింగ్ తేదీ అమావాస్య నాడే వ‌చ్చింది. కేసీఆర్… త‌న స్వ‌గ్రామం సిద్దిపేట జిల్లా చింత‌మ‌డ‌క గ్రామంలో ఓటేయ్యాలి. ఆయ‌న‌కు, ఆయ‌న భార్య శోబ‌కు అక్క‌డే ఓటు ఉంది. దీంతో… కేసీఆర్ దంప‌తులు అమావాస్య నాడు ఓటేస్తారా… లేక డుమ్మా కొడుతారా అన్న చ‌ర్చ న‌డుస్తోంది. కానీ…సీఎం హోదాలో ఉన్న వ్య‌క్తే త‌న ఓటు హ‌క్కు వినియోగించ‌కుండా ఉంటే, తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. అప్పుడు కేసీఆర్ న‌మ్మ‌కాలు మ‌రోసారి తెర‌మీద‌కు వ‌స్తాయి.

అయితే, కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌కు అధికారులు ఏర్పాట్లైతే పూర్తి చేశారు. ఫాం హౌజ్ నుండి చింత‌మ‌డ‌కు చేరుకునేందుకు ఏర్పాట్లు, చింత‌మ‌డ‌క గ్రామంలో… హెలిప్యాడ్ నిర్మాణం… సెక్యూరిటీ అంశాలు పూర్తిచేసిన‌ట్లు తెలుస్తోంది.

అయితే, విలేక‌రి.నెట్ ఓ జ్యోతిష్యుడిని, కేసీఆర్ జాత‌కం… అమావాస్య సందేహాల‌పై అడ‌గ్గా… అమావాస్య మ‌ద్యాహ్నం త‌ర్వాత పోతుంద‌ని, ఆ త‌ర్వాత మంచి ముహుర్త‌మే ఉంద‌ని తెలిసింది.

చూడాలి మ‌రీ… కేసీఆర్ త‌న న‌మ్మ‌కాన్ని కొన‌సాగిస్తూ మ‌ద్యాహ్నం త‌ర్వాతే ఓటు హ‌క్కు వినియోగించుకుంటాడా, న‌మ్మ‌కాల‌ను ప‌క్క‌న‌పెట్టి… అమావాస్యలోనే ఓటేస్తాడా… లేదా అస‌లు ఓటేయ‌టానికి ఇష్ట‌ప‌డ‌కుండా ఉంటారా

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*