అవినీతి కేసుల‌తో… కేసీఆర్, కేటీఆర్ ల‌పై గురిపెట్టిన కాంగ్రెస్.

Read Time: 0 minutes

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌… కాంగ్రెస్ ప‌థ‌కం ప్ర‌కారం ముందుకెళ్తున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మ్యానిఫెస్ట్ అంశాల‌ను మాత్ర‌మే ఎక్కువ‌గా ఫోక‌స్ చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వ‌రుస‌గా క‌ల్వ‌కుంట్ల కుటుంబ అక్ర‌మాలు, అవినీతిని ఒక్కోటిగా బ‌య‌ట‌పెడుతోంది.

ఓ వైపు ప్ర‌చారం, మ‌రో వైపు కూట‌మి త‌రుపున మ్యానిఫెస్టోను జ‌నాల్లోకి తీసుకెళ్తునే, ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉండ‌గా చేసిన అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెడుతోంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండి, కేసీఆర్ చేసిన అవినీతిని ఉత్త‌మ్ బ‌య‌ట‌పెట్టారు. ఈఎస్ఐ కార్యాల‌య నిర్మాణం కోసం కేంద్ర సంస్థ‌ల‌కు కాంట్రాక్టు ఇచ్చిన త‌ర్వాత‌, బెదిరించి… ఆ కాంట్రాక్టును త‌న మ‌నిషి ఆంద్రా ఫిష‌రీస్ లో సూర్య‌నారాయ‌ణ రావు కు ఇప్పించాడ‌ని, దానిపై సీబీఐ కేసు కూడా ఉంద‌ని తెలిపారు.  సిబిఐ ఇప్ప‌టికే కేసీఆర్ ను విచారించింద‌ని, దాన్ని నుండి బ‌య‌ట‌పడేందుకే కేసీఆర్ ప‌దేప‌దే డిల్లీ వెళ్లి… కంటి చికిత్స పేరుతో, డిల్లీలో ఉండి మోడీని క‌లుస్తార‌ని మండిప‌డ్డారు.

ఉత్త‌మ్ కేసీఆర్ అవినీతిని బ‌య‌ట‌పెట్టిన మ‌రుస‌టి రోజే మాజీ ఎంపీ, రాహుల్ స‌న్నిహితుడు మ‌దుయాష్కీ కేటీఆర్ అవినీతి బాగోతాన్ని బ‌య‌ట‌పెట్టాడు. కేటీఆర్ తెలంగాణ ఉద్య‌మ కాలంలో… సినిమా, ఇత‌ర ఇండ‌స్ట్రీల బ‌డా నేత‌ల‌ను బెద‌రించి అక్ర‌మ ఆస్తుల‌ను కూడ‌బెట్టార‌ని విమ‌ర్శించారు. కేటీఆర్ ఆస్తి 2014లో 7 కోట్లు ఉంటే, 2018 వ‌చ్చే స‌రికి 400శాతం పెరిగి 41 చేరింద‌ని విమ‌ర్శించారు. కేటీఆర్ ప్ర‌బుత్వాన్ని అడ్డంపెట్టుకొని… కోట్లు కూడ‌బెడుతూ… మ‌లేషియా, సింగ‌పూర్ ల మీదుగా అమెరికాకు చేరుస్తున్నార‌ని, అక్క‌డ ఫార్మా కంపెనీల‌తో క‌లిసి… డ‌బ్బు సంపాదించార‌ని సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ప‌లు ఫార్మా కంపెనీల‌తో కుమ్మ‌క్కైయ్యార‌ని ఆరోపించారు మ‌ధుయాష్కీ.

ఇంత‌టితో కేసీఆర్ కుటుంబాన్ని వ‌ద‌ల‌బోమ‌ని… తెలంగాణ ప్ర‌జ‌ల ముందు కుటంబ క‌థ‌ల‌ను బయ‌ట‌పెడుతామ‌ని స్ప‌ష్టంచేశారు. ఇప్ప‌టికే కేసీఆర్, కేటీఆర్ ల దందా బ‌య‌ట‌పెట్టామ‌ని…. ఇక కేసీఆర్ కూత‌రు క‌విత‌, ఆయ‌న అల్లుడు తో పాటు.. మ‌రో అల్లుడు హ‌వాయి చెప్పుల‌తో తిరిగే హ‌రీష్ రావు అక్ర‌మ ఆస్తుల‌ను కూడా త్వ‌ర‌లో… ఎపిసోడ్ వైజ్ బ‌య‌ట‌పెడుతామ‌ని తెలిపారు.

దీంతో… కాంగ్రెస్ ప‌క్కా వ్యూహం ప్ర‌కారం వెళ్తోంద‌ని, ఏఐసీసీ నుండి వ్యూహాలు ర‌చిస్తూ… అమ‌లు ప‌రుస్తున్నార‌ని  అంచ‌నా వేస్తున్నారు  రాజకీయ విశ్లేష‌కులు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*