ఆ రెండు పార్టీల ధీమా అదొక్క‌టే

Read Time: 0 minutes

ఓవైపు టీఆర్ఎస్, మ‌రోవైపు కాంగ్రెస్ కూట‌మి నేత‌లు ఎవ‌రికి వారు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మాదే గెలుపంటే, మాదే గెలుప‌ని బ‌ల్ల‌గుద్దీ చెబుతున్నారు. అంత‌టితో ఆగ‌కుండా… ప్ర‌చారంలో ఎలా పోటీప‌డుతారో, అలాగే  మాదే గెలుప‌నే ప్ర‌క‌ట‌నలో కూడా పోటీప‌డుతున్నారు. అయితే… దీని వెనుకా ఓ ఎత్తుగ‌డ క‌న‌ప‌డుతోంది.

అధికారం కోసం టీఆరెఎస్ పార్టీ, కాంగ్రెస్ కూట‌మి ప్ర‌ధానంగా పోటీప‌డుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు ఎలా ఉన్నా, స్థానికంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో తిరిగి, ప్ర‌జాభిప్రాయాన్ని ద‌గ్గ‌ర నుండి చూసిన వారు నెక్ టు నెక్ పోటీ త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. గ్రౌండ్ లో తిరిగిన జ‌ర్నలిస్టుల మాట కూడా ఇదే. కొన్ని చోట్ల కేసీఆర్ ప‌థ‌కాల ప్ర‌భావం ఉంటే, మ‌రికొన్ని చోట్ల కేసీఆర్ ఫెయిల్యూర్స్ ప్ర‌ధాన ఎజెండా అయ్యాయి. అయితే… కాంగ్రెస్ హ‌మీలు 100శాతం ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేద‌నేది అక్ష‌ర స‌త్యం. వీటిని ప‌క్క‌న‌పెడితే… ఈవీఎంల‌లో నిక్షిప్తం అయిన ఫ‌లితాల‌పై ఆయా పార్టీల నేత‌ల కామెంట్స్ చూస్తే కూడా నెక్ టు నెక్ పోటీ ఉంద‌నేది వారి అంచ‌నా.

ఎగ్జిట్ పోల్స్ తో ప‌నిలేకుండా… పోలింగ్ ముగియ‌గానే, కాంగ్రెస్ నేత‌లు త‌మ కూట‌మి గెలుపుపై దీమా వ్యక్తం చేశారు. కీల‌క‌మైన నాయ‌కుల ఆ ప్ర‌క‌ట‌న‌లో కొంత ఆత్మ‌విశ్వాసం… ఎక్క‌డో భ‌యం క‌న‌ప‌డింది. ఇటు టీఆర్ఎస్ ప‌రిస్థితీ అంతే. అయితే… కాంగ్రెస్ నాయ‌కులు ఎక్కువ మంది మాట్లాడే స‌రికి, ఎగ్జిట్ పోల్స్ జ‌నాల్లోకి పోయాయి కానీ… టీఆర్ఎస్ ఎందుకు సైలెంట్ అయింది, ఆ పార్టీ నేత‌లు ఎందుకు మాట్లాడ‌టం లేదు… ఓడిపోబోతున్నామా అన్న అనుమానం కూడా వ‌చ్చినా, వెంట‌నే కేటీఆర్ రంగంలోకి దిగి… అటు ల‌గ‌డ‌పాటిని, ఇటు కూట‌మిని తిట్టిపోశారు. కేటీఆర్ మాటల్లోనూ ఓ వైపు గాంభీర్యం, మ‌రోవైపు ఎక్క‌డో తేడా కొడుతుంద‌న్న స్ప‌ష్ట‌త క‌న‌ప‌డింది.

అయ‌తే, ల‌గ‌డ‌పాటి స‌ర్వే అయినా…. మ‌రొక‌ట‌యినా, ఈ రెండు పార్టీలు కూడా మాకే 50స్థానాలు దాటుతాయ‌ని… ఇత‌రుల స‌హ‌యంతో అయినా ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌న్న ధీమానే ఎక్కువ‌గా క‌న‌ప‌డుతోంది. రెండు పార్టీల నేత‌ల మాట‌లు… చెప్తొన్న అర్థం కూడా అదే. అయితే… టీఆర్ఎస్ పార్టీ ఇటు ఎంఐఎం మ‌ద్ద‌తో, లేక బీజేపీ మ‌ద్ద‌తో ఉంటుంద‌న్న ధీమాతో ఉండ‌గా, చివ‌రి నిమిషంలో అవ‌స‌ర‌మ‌యితే ఎంఐఎం కాంగ్రెస్ వైపు న‌డుస్తుంద‌ని, ఇక ఇత‌ర ఇండిపెండేంట్లు ఎలాగు తమ పార్టీ రెబ‌ల్సే ఉంటార‌ని ధీమా ఉన్నారు.

చూడాలి నేత‌ల ధీమా… పార్టీల ధీమా ఎంత‌వ‌ర‌కు విజ‌య‌తీరాల‌కు చేర్చూతాయో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*