ఆ విషయంలో రేవంత్ రెడ్డి అంత ధీమాగా ఉన్నాడా…

Read Time: 0 minutes

రాజకీయ నేతలు గెలుపోటములపై ఓ అంచనాతో ఉండటం సహజమే. కానీ ఎన్నికల్లో పోటాపోటీ గా పని చెసిన తర్వాత ఎవరికైనా కాస్త బిడియం ఉంటుంది. ఫలితాలు ఎలా ఉంటాయో అన్న ఆందోళన కూడా ఉంటుంది. అయితే… ఈ విషయంలో రేవంత్ మాత్రం ఫుల్ క్లారిటీ తో ఉన్నాడు.

కొడంగల్ ఫైట్ ఎంత వేడి రగిల్చిందో అందరికి తెలుసు. హెలికాప్టర్ ప్రచారాన్ని మధ్యలో వదిలేసి, కొడంగల్ లొనే మకాం వేసి మరీ ప్రచారం చేశాడు రేవంత్ రెడ్డి. టీఆరెస్, కాంగ్రెస్ లు హోరాహోరీ ఫైట్ జరిగింది. రేవంత్ రెడ్డి ని ఓడించేందుకు కేటీఆర్, హరీష్ లు రంగంలోకి దిగారు. లక్షల డబ్బు దొరికింది. రెండు వర్గాలు హోరాహోరీ కాలుదువ్వటం తో కొడంగల్ ఫైట్ రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే కొడంగల్ లో గెలుపు ఎవరిది అంటూ లక్షల్లో బెట్టింగ్ నడుస్తోంది. దింతో రేవంత్ రెడ్డి గెలుస్తాడా ఒడుతాడా అని చర్చలు నడుస్తోన్న సందర్భాల్లో రేవంత్ రెడ్డి  కేటీఆర్ పై సవాల్ చర్చనీయాంశం అవుతోంది.

నేను ఓడిపోతే… రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా, నేను గెలిస్తే నువ్వు తప్పుకుంటావా అంటూ సవాల్ విసిరారు. గతంలో రేవంత్ ను ఓడించి తీరుతా, లేదంటే రాజకీయల నుండి తప్పుకుంటా అని కేటీఆర్ సవాల్ వేయగా, నేడు రేవంత్ రెడ్డి ప్రతి స్పందించారు.  దింతో… కొడంగల్ రేవంత్ రెడ్డి దే అని స్పష్టం అయిపోయింది. కేటీఆర్ ఆవేశంతో ఏదేదో మాట్లాడారు…. ఇప్పుడవన్నీ తెరపైకి వస్తున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*