ఎగ్జిట్ పోల్స్ ను కూడా కేసీఆర్ పెయిడ్ వార్త‌లు చేసేశాడా…?

Read Time: 0 minutes

ఎగ్జిట్ పోల్స్ చెప్పేవ‌న్నీ నిజం కాకున్నా… అందులోనూ పెయిడ్ పోల్స్ వేస్తారా, ఎన్నిక‌ల ముందంటే… ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తార‌నుకోవ‌చ్చు కానీ పోలింగ్ అయిపోయాక ఎందుకు పెయిడ్ పోల్స్ వేస్తారా… అంటే అవున‌నే అనుమానం వ‌స్తోంది. కేసీఆర్ ఈ ప‌ని చేశార‌ని కాంగ్రెస్ నేత‌ల మాట‌లు చెప్తున్నాయి.

ముఖ్యంగా ఓ ప్ర‌ముక ఇంగ్లీష్ చానల్ రాష్ట్రంలో టీఆర్ఎస్ కూట‌మి భారీ మెజారిటీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని ఎగ్జిట్ పోల్ ఇచ్చింది. ఈ పోల్ రిజ‌ల్ట్స్ చూస్తే… టీఆర్ఎస్ పార్టీ సొంత మీడియా త‌ర్వాత‌, అంత డ‌బ్బాగా ఇచ్చిన చాన‌ల్ అదే. ఆ చాన‌ల్ గ‌తంలోనూ ప్రీపోల్ స‌ర్వేలోనూ ఇదే త‌ర‌హా రిజ‌ల్ట్ వ‌స్తుంద‌ని తెలిపింది. కొంత‌కాలంగా ఈ చాన‌ల్ తో కేసీఆర్ అంట్ టీం మంచి రిలేష‌న్స్ మెయింటేన్ చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.

అయితే… పీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన కామెంట్ మాత్రం టీర్ఎస్ పై, స‌ద‌రు గ్రేట్ ఇంగ్లీష్ చాన‌ల్ పై అనుమానాలు రేకేత్తిస్తోంది. ముఖ్యంగా ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాజ్ దీప్ స‌ర్దేశాయ్ త‌న‌కు ఫోన్ చేశార‌ని, పోటాపోటీ సీట్లు రాబోతున్న‌ట్లు మా అంచ‌నా అంటూ చెప్పారు. కానీ ఎగ్జిట్ పోల్ అలా వేయ‌టంలో ఇత‌ర‌త్రా కార‌ణాలున్నాయంటూ… చెప్పాడ‌న‌టంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

అయితే, నెక్ టు నెక్ ఫైట్ లో ఇద్ద‌రికీ స‌మానం గా సీట్లు వ‌స్తే… ఇండిపెండేంట్లు, చిన్న పార్టీలు క్రీయాశీల‌కం అవుతాయి. అలాంటి వారిని త‌మ వైపే ఉంచుకోవాలంటే…గెల‌వ‌బోయే ఇండిపెండేట్ల‌తో సింగిల్ గా మాట్లాడే అవ‌కాశం ఉండేలా, త‌మ‌దే ప్రభుత్వం రాబోతుంది… మీరు గెలుస్తారు, మంచి ప‌ద‌వి ఇస్తాన‌ని ముందే త‌మ దారిలోకి తెచ్చుకునే ఆస్కారం ఉండేందుకే ఇలా పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ చేయించేందుకు అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. రాజ్ దీప్ మాట‌లు అదే అర్థాన్ని ఇస్తున్నాయ‌ని, ఉత్త‌మ్ చెప్పింది నిజ‌మే అయితే… ఇవ‌న్నీ నిజాలే అవుతాయంటూ స్ప‌ష్టం చేస్తున్నారు.

ఏదీ ఏమైనా… ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌క‌ట‌న‌కు కౌంట్ డౌన్ కూడా మొద‌లైన నేప‌థ్యంలో, ఎవ‌రిని గెలుపు వ‌రిస్తుందో… ఎవ‌రివి జిమ్మిక్కులుగా మిగుల‌బోతున్నాయో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*