ఏపీలో బాబుకు షాక్, జ‌న‌సేన‌లోకి వ‌రుస‌పెట్టిన మాజీ మంత్రులు.

Read Time: 0 minutes

తెలంగాణ‌లో కేసీఆర్ కు షాకిచ్చే ప‌నిలో చంద్ర‌బాబు నిమ‌గ్న‌మ‌యితే… ఏపీలో చంద్ర‌బాబుకు షాక్ త‌గులుతోంది. నిన్న‌టి వ‌ర‌కు ఓకే ప్ర‌తిప‌క్షంగా వైసీపీ ఉంటే, ఇప్పుడు జ‌న‌సేన జోరుగానే తెర‌పైకి దూసుకోస్తుంది. గ‌తంలో బ‌ల‌మైన నేత‌లుగా ఉండి, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత క‌నుమ‌రుగైన నేత‌ల‌కు ఇప్పుడు జ‌న‌సేన వేధిక‌వుతోంది.

తెలంగాణ బిల్లును తీవ్రంగా వ్య‌తిరేకించి… బిల్లుపై ఎన్నో సంక్లిష్ట నిర్ణ‌యాలు తీసుకొని, ఆ త‌ర్వాత క‌నుమ‌రుగైన నాటి స్పీక‌ర్ నాదేండ్ల మ‌నోహ‌ర్ జ‌న‌సేన గూటికి వెళ్లిపోయారు. ఆయ‌న బాట‌లోనే బ‌ల‌మైన గిరిజ‌న నేత, మాజీ మంత్రి బాల‌రాజు ప‌వ‌న్ జై కొట్టేశారు. ఇక రేపో మాపో మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత్ వెళ్తాడ‌నే ప్ర‌చారం ఓ వైపు జోరుగా సాగుతుండ‌గానే, టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి… రావెల కిషోర్ బాబు ప‌వ‌న్ కు జైకొట్టేశాడు. ఇలా ఒక‌రివెంట ఒక‌రు మంత్రులుగా ప‌నిచేసిన నాయ‌కులంతా జ‌న‌సేన‌లోకి వెళ్ల‌టం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

పైగా… ఈ పెద్ద నేత‌ల చేరిక‌ల విష‌యంలో జ‌న‌సేన కాస్త మైండ్ గేమ్ ప్లే చేస్తున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చేరిన పెద్ద నేత‌లంతా… ఒక్కోక్క‌రు ఒక్కో సామాజిక వ‌ర్గ బ‌ల‌మైన నేత‌లుగా ముద్ర‌ప‌డ్డ‌వారే. పైగా… ఒక్క రావెల పై కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నా, ఇత‌ర నేత‌ల‌కు క్లీన్ ఇమేజ్ ఉంది. రావెల ద‌ళిత‌( క్రిస్టియ‌న్ ) సామాజిక వ‌ర్గ నేత‌. పైగా సివిల్స్ నుండి స్వ‌చ్చంద విరమ‌ణ తీసుకొని, కాన్షీరాం స్పూర్తితో రాజ‌కీయాల‌కు వ‌చ్చిన వ్య‌క్తి. గిరిజ‌న నేత బాల‌రాజుకు కూడా ప్ర‌త్యేక ఇమేజ్ ఉంది. క్లీన్ ఇమేజ్ అత‌ని సొంతం. పైగా… జ‌గ‌న్, చంద్ర‌బాబు పార్టీల్లో ఉన్న గిరిజ‌న నేత‌ల‌కు దీటైన నాయ‌కుడు. ఇక నాదేండ్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఇలా… జాగ్ర‌త్త‌గా, ప‌క్కా వ్యూహంతో జ‌న‌సేన చేరిక‌ల‌ను  ప్రోత్స‌హిస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఆయా జిల్లాల్లో బ‌ల‌మైన నేత‌ల చేరిక‌లు ఉండ‌బోతున్నాయ‌న్న  స‌మాచారంతో కాంగ్రెస్, వైసీపీ, టీడీపీలు అల‌ర్ట్ అయిపోయాయి. ఇన్నాళ్లు త‌క్కువ అంచ‌నా వేసిన జ‌న‌సేన క్ర‌మంగా బ‌లం పుంజుకోవ‌టంతో నేత‌లు చేజార‌కుండా చూసుకుంటున్నారు.

దీంతో… బాబు తెలంగాణ‌లో ఎన్నిక‌లు ముగించుకొని, ఓక‌వేళ హంగ్ వ‌చ్చి… ప్ర‌భుత్వం ఏర్పాటు, త‌మ మంత్రిప‌ద‌వుల అంశం చూసుకొని వ‌చ్చే స‌రికి…. అసంతృప్త నాయ‌కులతో ఏపీలో చంద్ర‌బాబు కు పోటు త‌ప్ప‌దంటున్నారు విశ్లేష‌కులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*