కూక‌ట్ ప‌ల్లి, స‌త్తుప‌ల్లి… టీఆర్ఎస్ టార్గెట్.

Read Time: 1 minutes

టీఆర్ఎస్ పార్టీ కొన్ని సీట్ల‌లో ప్ర‌త్యేక ఫోకస్ పెట్టింది. అయితే కూట‌మి ఏర్పాటుతో మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో… టీడీపీ బ‌లంగా ఉన్న ఈ రెండు స్థానాలను కొల్ల‌గొట్టేందుకు అన్ని శ‌క్తులు దార‌పోస్తుంద‌ని తెలుస్తోంది. కూక‌ట్ ప‌ల్లి, స‌త్తుప‌ల్లిపై జెండా ఎగురేసేందుకు ఊవ్విళ్లూరుతోంది.

కూక‌ట్ ప‌ల్లి టీడీపీకి ఎంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర లేదు. ఇక్క‌డ కూట‌మి నుండి టీడీపీ అబ్య‌ర్థిగా నంద‌మూరి సుహ‌సిని బ‌రిలో ఉంది. ఇక్క‌డ గెలుపు…. చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌కం. ఇక్క‌డ సుహ‌సిని ఓట‌మి పాల‌యితే… బ‌లి ప‌శువును చేశార‌ని, ఓడే సీటును ఇచ్చార‌ని, నంద‌మూరి ఫ్యామిలీని నాశనం చేసే ఎత్తుగ‌డ అని, ఏపీలో మంత్రిని చేసే అవ‌కాశం ఉన్నా… ఇక్క‌డ పోటీ చేయించి ఓడించార‌ని, ఇలా ఎన్నో ఆరోప‌ణ‌లకు చంద్రబాబు స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుంది. అందుకే, ఇక్క‌డ చంద్రబాబు… ఆయ‌న బ‌లగం ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌గా, ఎలాగైనా ఓడించి… బాబుకు ఇబ్బందులు  సృష్టించాల‌ని టీఆరెస్ పార్టీలు నువ్వా–నేనా అన్న‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. కోట్ల రూపాయ‌లు చేతులు మారుతున్నాయి.

ఇక స‌త్తుప‌ల్లి. ఖ‌మ్మం లో టీడీపీ కంచుకోట‌లో ఒక‌టైన ఈ స్థానాన్ని… 2014 నుండి సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌ను పార్టీలో చేర్చుకొని త‌మ ఖాతాలో వేసుకునేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ నేర‌వేర‌లేదు. సండ్ర టీఆర్ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు లొంగ‌లేదు. పైగా అది తుమ్మ‌ల నాగేశ్వ‌ర్రావు స్థానం కావ‌టంతో… సీఎం ప్ర‌త్యేకంగా ఈ భాద్య‌త నీదేన‌ని తేల్చి చెప్పార‌ట‌. దీంతో… తుమ్మ‌ల త‌న స్థానం క‌న్నా ఎక్కువ స‌మ‌యం స‌త్తుప‌ల్లి మీదే పెట్టారు. కూట‌మితో సండ్ర బ‌లం పెర‌గ‌టంతో… ఇక్క‌డ కూడా డ‌బ్బు ప్ర‌వాహం ఎక్కువ‌గానే ఉంది. తుమ్మ‌ల‌కు బుద్ది చెప్పాల‌ని కూట‌మి, కేసీఆర్ కు గిఫ్ట్ ఇవ్వాల‌ని తుమ్మ‌ల ప‌ట్టుద‌ల‌తో ఉండ‌టంతో… డ‌బ్బు,  మ‌ద్యం ప్ర‌వాహం న‌డుస్తోంది.

ఇలా ఈ రెండు సీట్లు… టీడీపీకి, టీఆర్ఎస్ కు మద్య రాజ‌కీయ వేడిని రెట్టింపు చేస్తోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*