కూటమికి, టీఆరెస్ కు ముహూర్త టెన్షన్…

Read Time: 0 minutes

ఇప్పటికైతే ఎవరు గెలుస్తారు, ఎవరు ఒడుతారు… హంగ్ వస్తే ఎట్లా ఇలాంటి అంశాలే తెరపైకి వచ్చాయి. కానీ ఎవరూ గెలిచిన ముహూర్తం ఎట్లా అనే టెన్షన్ పట్టుకుంది. ఫలితాలు డిసెంబర్ 11న ప్రకటిస్తారు. ఆ మరుసటి రోజే అంటే 12నే మంచి ముహూర్తం ఉంది. ఆ తరువాత అంతటి ముహుర్తాలు లేవని, సంక్రాంతి పీడ దినాలు వచేస్తాయంటున్నారు పండితులు.

అయితే…. టీఆరెస్, కూటమి లో ఎవరు గెలిచినా మంచి ముహూర్తం లొనే కొత్త సర్కార్ ఏర్పాటు చేయాలనుకుంటారు.  టీఆరెస్ గెలిస్తే…. మెజారిటీని బట్టి డ్రైవర్ మారె సూచనలు కనిపిస్తున్నాయి. 70 ప్లస్ తో టీఆరెస్ స్వతహాగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయగలిగితే…. కేటిఆర్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అలాకాకుండా సంకీర్ణ ప్రభుత్వం ను నడపాలంటే మాత్రం కేసీఆర్ కొద్దిరోజులు సీఎం గా కొనసాగబోతున్నారు. అయితే మరుసటి రోజే ఆయన  ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

ఇక కూటమి గెలిచే పరిస్థితి ఉన్నా, హంగ్ పరిస్తితి ఉన్నా…. చర్చలకే పుణ్య కాలాం పోతుంది. సీఎం ఎవరు, మంత్రులు ఎవరు అనే విషయాలు అంత హిజిగా తెగవు. కూటమి సిగపట్లు ఉండే ఉంటాయి. హంగ్ వస్తే…. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉత్తమ్ మాత్రం తాము డిసెంబర్ 12 న ప్రమాణస్వీకారం చేస్తామని ధీమాగా ఉన్నా, వాస్తవ పరిస్థితులు వేరుగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే సీఎం గా కాంగ్రెస్ ఉంటది కాబట్టి…. ఒక్క సీఎం అభ్యర్థిని త్వరగా తేల్చాల్సి ఉన్నా, కాంగ్రెస్ గ్రూపు లు చూస్తుంటే…. అది అంత హిజి వ్యవహారం కాదు.

సో ఇలా…. ముహూర్తం ఇప్పుడు అన్ని పార్టీలను భయపెడుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*