కేసీఆర్ ను క‌ల‌వ‌ర‌పెడుతోన్న అమావాస్య గండం.

Read Time: 0 minutes

కేసీఆర్ కు పూజ‌లు, వారాల‌పై ఎంత న‌మ్మ‌కముందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌ల అధికారం కోసం యాగాలు కూడా చేశారు. చిన‌జీయర్ స్వామికి సాష్టాంగ న‌మస్కారం చేసి, యాగం చేసిన త‌ర్వాతే… ప్ర‌చార ప‌ర్వంలోకి దిగారు.

అయితే… కేసీఆర్ ను ఇప్పుడు పోలింగ్ డే బ‌య‌పెడుతోంది. పోలింగ్ ఎలా ఉంటుందో అనే విష‌యంలో కాదు. ఆ రోజు నిండు అమావాస్య‌. అమావాస్య నాడు కేసీఆర్ బ‌య‌ట కూడా కాలు పెట్ట‌డు. అమావాస్య రోజు ఏం చేసిన మంచి జ‌ర‌గ‌దు అని బ‌లంగా విశ్వ‌సిస్తారు కేసీఆర్. అందుకే ఆయ‌న మంగ‌ళ వారాలు, అమావాస్య‌ల్లో క‌నీసం బ‌య‌టకు కూడా వెళ్ల‌రు. కానీ పోలింగ్ డే రోజే అమావాస్య వ‌స్తోంది. నిండు శుక్ర‌వారం రోజు… దీంతో, ఆయ‌న కీడు శంకిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే యాగాలు కూడా నిర్వ‌హించార‌ని ఆయ‌న స‌న్నిహితులు అంటున్నారు.

ఆయ‌న ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు కూడా అన్ని ముహుర్తాలు చూసుకునే రాజీనామా చేశారు. ఆయ‌న ల‌క్కీ నెంబ‌ర్ 6తో పాటు, ఆయ‌న జ‌న్మ న‌క్ష‌త్రాలతో స‌రితూగాకే ఆయ‌న ఓకే చెప్పారు. అనుకున్న‌ట్లే అంతా స‌వ్యంగా అయినా… ఆయ‌న‌కు ఉన్న స‌మాచారం నోరు జార‌టంతో, ఎన్నిక‌ల క‌మీష‌న్ కొత్త తేదీల‌తో ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న చేసింది. మొద‌ట్లో కొంత ఇబ్బంది ప‌డ్డా… చేయ‌క‌ని త‌ప్ప‌ని ప‌రిస్థితులు ఏదురైన నేప‌థ్యంలో… కేసీఆర్ ఎం చేస్తార‌ని అంతా భావించారు. అయితే… త‌న పండితులతో కేసీఆర్ కొన్ని చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, అందులో భాగంగానే ఆ మ‌ద్య చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిపించార‌ని తెలుస్తోంది. రాబోయే ఎన్నిక‌ల అమావాస్య త‌మ‌కు ఎలాంటి దోషం లేకుండా చూసే యాగ‌మేన‌ని భావిస్తున్న వారు కూడా ఉన్నారు.

అయితే, టీఆర్ఎస్ లోని ఇత‌ర నేత‌లు మాత్రం… కేసీఆర్ జ‌న్మ‌న‌క్ష‌త్రాన్ని, పోలింగ్ స‌మయాన్ని… ఇత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే… ఆయ‌న‌కు మంచే జ‌రుగుతుంద‌ని స్వామీజీలు చెప్పార‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు.

చూడాలి మ‌రీ… కేసీఆర్ జ్యోతిష్యం ఎంత‌మేర‌కు ఫ‌లిస్తుందో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*