కేసీఆర్ స‌క్సెస్, కూట‌మి ఫెయిల్యూర్ ఆ ఒక్క‌టే.

Read Time: 0 minutes

ఎన్నో ఆశ‌ల‌తో కూట‌మి క‌ట్టినా, అభ్య‌ర్థుల‌పై ఎంతో వ్య‌తిరేక‌త ఉన్నా… కేసీఆర్ ముఖంతో జ‌నాల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ అఖండ మెజారిటీకి తేడా ఒక్క‌టే క‌న‌ప‌డుతోంది. కేసీఆర్ ర‌చించిన ఆ ఒక్క వ్యూహ‌మే టీఆర్ఎస్, కూట‌మి కి తేడా. అదే ఓట్ల చీలిక వ్యూహం.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఓటు చీల‌కుండా ఉండేందుకు టీజెఎస్, కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ జ‌త క‌ట్టాయి. బీజేపీ చివరి వ‌ర‌కు కోదండ‌రాం కోసం ప్ర‌య‌త్నించి, విఫ‌ల‌మ‌యి… ఓంట‌రిగా వెళ్ల‌గా, బీఎల్ఎఫ్ కూడా ఒంట‌రిగా వెళ్ల‌టంతో కేసీఆర్ వ్యూహాం ప‌క్క‌గా అమ‌ల‌యింది. ముఖ్యంగా బీజేపి చాలా చోట్ల గ‌ణ‌నీయంగా ఓట్లు చీల్చిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. చార్మినార్, క‌ర్వాన్ లో  చాలా రౌండ్ల‌లో ఆధిక్యంలో ఉంది. అదిలాబాద్, నిర్మ‌ల్, భూపాల‌ప‌ల్లి, ముదోల్, ఖానాపూర్ ఇలా చాలా ప్రాంతాల్లో మంచి ఓట్లు రాబ‌ట్టుకుంది. అక్క‌డే మ‌హ‌కూట‌మి ఓట్ల‌కు పునాది ప‌డింది. కేసీఆర్ ఊహించిన‌ట్లే ఓట్లు చీలిపోయాయి. ఖ‌మ్మం, న‌ల్గొండ లాంటి చోట్ల బీఎల్ఎఫ్ కూడా భారీగానే ఓట్లు చీల్చ‌గలిగింది.

అందుకే చాలా చోట్ల టీఆర్ఎస్, కాంగ్రెస్ కూట‌మి అబ్య‌ర్థులు పోటాపోటీగా ఉన్నారు. క‌రీంన‌గ‌ర్ లో ధ‌ర్మ‌పురిలో 167 ఓట్ల‌తో టీఆర్ఎస్ గెలిచిందంటే…. ఓట్ల చీలిక కాంగ్రెస్ కు ఎంత‌న‌ష్టం చేకూర్చిందో అర్థం చేసుకోవ‌చ్చు. బీజేపీ టీఆర్ఎస్ ర‌హ‌స్య మిత్రులు అన్న అభిప్రాయాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌టంలో పూర్తిగా ఫ్లాప్ అయింది కూట‌మి. అందుకే బీజేపీకి ఓట్ల‌శాతం పెరుగుతోంది. దీనికి తోడు… కేసీఆర్ అనుస‌రించిన ప్రో ఎంఐఎం వైఖ‌రి కూడా క‌లిసివ‌చ్చింది. నిజానికి ఈ వైఖ‌రి, మిత్ర‌పోటీ ఎంఐఎంకు కొత్త చేటు చేసిన‌ట్లు క‌న‌ప‌డింది. అందుకే కొన్ని చోట్ల బీజేపి ట‌ఫ్ ఫైట్ ఇవ్వ‌గ‌లిగింది.

ఓట్ల చీలిక‌, మైనారిటీ ఓట్ల‌కు తోడు… పెన్ష‌న్ల పెంపును కాంగ్రెస్ తో స‌మానంగా ప్ర‌క‌టించ‌ట‌మే కేసీఆర్ స‌క్సెస్ కు, కూట‌మి ఫెయిల్యూర్ కు తేడా ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*