గెలుపు ఉత్స‌హాంలో సుప్రీంకోర్ట్ పై కేసీఆర్ సంచ‌ల‌న వాఖ్య‌లు.

Read Time: 1 minutes

సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు. భారీ విజ‌యంతో మంచి ఊపు మీదున్న కేసీఆర్, మీడియాతో మాట్లాడే సంద‌ర్భంగా రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ప్రస్తావిస్తూ ఆస‌క్తిక‌ర‌, వివాదాస్పద వాఖ్య‌లు చెప్పాడు.

దేశంలో 50శాతానికి రిజ‌ర్వేష‌న్లు మించ‌కూడ‌ద‌ని ప‌లు సంద‌ర్భాల్లో సుప్రీం తీర్పు చెప్పింది. రిజ‌ర్వేష‌న్ల అంశం పై అనేక సంద‌ర్భాల్లో రాజ్యంగ ద‌ర్మాసానాలు కూడా తీర్పునిచ్చాయి. ప్ర‌త్యేక మిన‌హ‌యింపుతో, స‌వ‌ర‌ణ‌కు సుప్రీంకు వేలు పేట్టే ఆస్కారం లేకుండా ఒక్క త‌మిళ‌నాడు రాష్ట్రంలో 50శాతానికి మించి రిజ‌ర్వేష‌న్లు అమ‌లులో ఉన్నాయి.

అయితే, కేసీఆర్ మాట్లాడుతూ… రిజ‌ర్వేష‌న్లపై కేంద్రం, సుప్రీం కోర్టు పెత్త‌న‌మేంది అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నేను పూర్తి అవ‌గాహ‌న‌తోనే మాట్లాడుతున్నా, సుప్రీం ఇటీవ‌ల పంచాయితీ ఎన్నిక‌ల రిజ‌ర్వేష‌న్ల పై ఇచ్చిన తీర్పు స‌రైంది కాద‌ని, సుప్రీం త‌ప్పుడుగానే రిజ‌ర్వేష‌న్ల పిటీష‌న్ ను కొట్టేసింద‌ని తెలిపారు. అవి రాష్ట్రానికి ఉండాల్సిన హ‌క్క‌ని, వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సామాజిక వ‌ర్గాల వెనుక‌బాటు ఉంటుంద‌ని, కానీ అన్నీ ఓకే ఘాటున కట్టి…. రిజ‌ర్వేష‌న్ల‌పై ప‌ట్టువీడ‌మంటూ తేగేసి చెప్ప‌టం ప‌ద్ద‌తి కాదంటే కాద‌ని తెలిపారు. ఈ రిజ‌ర్వేష‌న్ల అంశం ఒక్క‌టే కాదు, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో ఉన్న ఈ దేశంలో… రాష్ట్రాల‌కు మ‌రిన్ని అధికారాలు బ‌దిలీ కావాల్సి ఉంద‌ని, ఎక్క‌డో గద్వాల నియోజ‌క‌వ‌ర్గంలో క‌ర్ణాట‌క బార్డ‌ర్ లో ఉండే గ‌ట్టు మండ‌లంలో ఓ మారు మూల ప్రాంతంలో క‌ట్టే ప్రాథ‌మిక పాఠ‌శాల‌కు మీ పెత్త‌నం ఎంద‌ని,  విద్యా-వైద్య విష‌యంలో మాకు తెలివి లేదా అంటూ ప్ర‌శ్నించారు.

రానున్న రోజుల్లో… ఒక్క నెల‌లో గుణాత్మ‌క మార్పును చూపిస్తామ‌ని, రెండు ప్ర‌త్యేక విమానాల‌తో… అస‌ద్, నేను దేశం మొత్తం తిరిగి  ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేస్తామ‌ని… అందులో భాగంగా మైనారిటీ వ‌ర్గాల అంశం ముందు టేక‌ప్ చేస్తున్నామ‌ని తెలిపారు.

రాబోయే రోజుల్లో… ప్రాంతీయ పార్టీ ప్రాధాన్య‌త ఉన్న మ‌రో జాతీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచ‌న కూడా ఉందంటూ బాంబ్ పేల్చారు కేసీఆర్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*