గెలుపోట‌ముల మ‌ద్య తేడా 2 శాతం ఓట్లే.

Read Time: 1 minutes

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో హోరాహోరీ ఉంద‌ని, అధికార టీఆర్ఎస్ పార్టీకి… మ‌హ‌కూట‌మికి మ‌ద్యే తేడా 2శాతం ఓట్లేనంటూ ప్ర‌ముఖ సెఫాజ‌లిస్ట్, ఎన్డీటీవీ జ‌ర్న‌లిస్ట్ క‌థ‌నాన్ని ప్ర‌సారం చేశారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు అంచ‌నా వేయ‌టంలో ఎంతో పేరున్న ఆయ‌న స‌ర్వే ఫ‌లితాల‌పై విశ్లేషించారు.

2014 ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను విశ్లేషిస్తూ… అప్పుడు టీర్ఎస్ పార్టీకి వ‌చ్చిన ఓట్ల‌శాతం, బీజేపీ–టీడీపీ కూట‌మిల‌కు… అందులో టీడీపీకి వ‌చ్చిన ఓట్ల‌ను లెక్క‌గ‌డుతూ ఎన్డీటీవీ త‌న స‌ర్వే అంశాల‌ను వెల్ల‌డించింది. మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో… ప్ర‌స్తుతం ట‌ఫ్ ఫైట్ నేల‌కొంద‌ని, అయితే… టీఆర్ఎస్ కు మేలు చేసే అవ‌కాశం కూడా లేక‌పోలేద‌ని విశ్లేషించింది.

తెలంగాణ‌లో క్రీయాశీల‌కంగా ఉండి, గెలుపోట‌మ‌లను నిర్దేశించ గ‌లిగే రిజ‌ర్వ్డ్ స్థానాలను కోట్ చేసింది. తెలంగాణ జ‌నాబాలో 10శాతం వ‌ర‌కు  ఎస్టీలు, ఇత‌ర గిరిజ‌నులు ఉన్నారు. ఇందులో 7శాతం వ‌ర‌కు లంబాడాలు ఉండ‌గా, వారంత టీఆర్ఎస్ కు మొగ్గుచూపుతున్నార‌ని… వారికి ప్ర‌త్యేక పంచాయితీలు ఏర్పాటు చేయ‌టం లాభించింద‌ని తెలిపింది. మిగిలిన వారంత కూట‌మికి అండ‌గా ఉన్నారని, అయితే… రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఈ వ‌ర్గాల్లో కేసీఆర్ పై కొంత అసంతృప్తి కూడా ఉంద‌ని తెలిపింది. ఇక ఎన్నో ఏండ్లుగా మాల‌-మాదిగ కులాల వారు వ‌ర్గీక‌ర‌ణ అంశం ప్ర‌భావం చూపుతోంద‌ని, మాదిగ వ‌ర్గాలు కూట‌మివైపే ఎక్కువ‌గా ఉండ‌బోతుండ‌గా… ఇందులో పెన్ష‌న్ల వంటి అంశాలు కొంత డివైడ్ టాక్ ను తీసుకొస్తున్నాయ‌ని తెలిపింది. ఇక హైద‌రాబాద్ ముస్లీంలు మ‌రోసారి ఏక‌ప‌క్షంగా మ‌జ్లిస్ కే మ‌ద్ద‌తిస్తున్న విష‌యంతో పాటు వారినే గెలుపు వ‌రించ‌బోతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇక అంతా అనుకుంటున్న‌ట్లే… ఉత్త‌ర తెలంగాణ‌లో టీఆర్ఎస్ బ‌లంగా ఉన్నా… ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కూడా బ‌లంగానే  ఉంద‌ని, ద‌క్షిణ తెలంగాణ‌లో కూట‌మి త‌న ఆధిక్య‌త‌ను నిల‌బెట్టుకోనున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ద‌క్షిణాదిలో… టీఆరెఎస్ కు, మ‌హ‌కూట‌మికి మ‌ద్య ఓట్ల తేడా 11శాతంగా ఉండ‌బోతుంద‌ని అంచనా వేసింది. కేవ‌లం 2శాతం ఓట్ల‌తోనే ఫ‌లితాలు ఉండ‌బోతున్నాయ‌న్న అంచనా నేప‌థ్యంలో… ద‌క్షిణ తెలంగాణ‌లో  మెజార్టీ గెలుపుతోనే కూట‌మికి అధికారం ద‌క్కే చాన్స్ ఉంద‌ని, అయితే… ఉత్త‌ర తెలంగాణ‌లో బోటా బోటీ మెజారిటీ అవ‌కాశం ఉన్న సీట్ల‌లో మ‌హ‌కూట‌మి అబ్య‌ర్థులు మ‌రింత ప‌ట్టుద‌లగా ప‌నిచేయాల‌న్న హెచ్చ‌రిక ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*