
ఏ ఎన్నికలయినా… అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది అని అందరూ అనేదే. ఎందుకు… అధికార పార్టీ ఓడిపోయిన సందర్భాలు లేవా అని వాదించే వారూ ఉంటారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా, పోలింగ్ కు ఒకటి రెండ్రోజుల ముందు మాత్రం అధికార పార్టీకి ఖచ్చితంగా ఎడ్జ్ అయితే ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా నిరోధించాలనే దానిపై ఉత్తమ్–చంద్రబాబు దృష్టిసారించారు.
నిజానికి… మహకూటమి మొదట్లో టీడీపీ ప్రభావం, చంద్రబాబు ప్రభావం పెద్దగా లేదు. కానీ ప్రచారంలో వేగం పెరిగిన కొద్ది మాత్రం క్రమంగా చంద్రబాబు ఎక్కువ ఫోకస్ చేశారు. కేసీఆర్ తిట్లు ఎలా పెరుగుతూ వచ్చాయో చంద్రబాబు కాన్సన్ట్రేషన్ కూడా అలాగే పెరిగిపోయింది. అయితే… ప్రచారం ముగిసిన నాటి నుండి, పోలింగ్ పూర్తయ్యే వరకు చాలా కీలకమైన సమయం. ఆ సమయంలో… అధికార పార్టీకి కొంత వెసులు బాటు ఉంటుంది. అధికారులు ఎలాగూ కొంతలో కొంతైనా… అధికార పార్టీకి అండగా ఉంటారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కి ఎడ్జ్ ఉంటుంది. దీంతో కాంగ్రెస్–టీడీపీలు అలర్టయ్యాయి. పోలింగ్ సరళిని అంచనా వేయటం, బూత్ లెవల్ లో తమ అబ్యర్థి గెలుపు ఎలా సాధ్యమవుతుంది వంటి పోల్ మ్యానేజ్ మెంట్ అంశాల్లో చంద్రబాబు,టీడీపీది ఎప్పుడూ పై చేయిగానే ఉంటుంది. దీంతో టీఆర్ఎస్ ను ఎలా ఎదుర్కొవాలో అనే అంశంపై చంద్రబాబు– ఉత్తమ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఎక్కడెక్కడ ముఖాముఖి ఫైట్ ఉంది, అతి తక్కువ ఓట్లతో గెలుపోటములు ఉన్న స్థానాలు… అక్కడ అనుసరించాల్సిన వ్యూహం పై వీరు ప్రత్యేకంగా సమావేశం కావటం చర్చనీయాంశం అయింది. ప్రచారానికి మరో మూడు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో, వీరి భేటీ కావటం… ఓవైపు రాహుల్ గాంధీ మరోసారి ప్రచారానికి రానున్న నేపథ్యంలో… ఈ భేటీ ప్రాధాన్యత ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక, గ్రేటర్ జోన్ లో టీడీపీ తరుపున ప్రత్యేకంగా సర్వే కూడా చేసినట్లు తెలుస్తోంది. ఆ సర్వే అంశాలు, ప్రచారానికి ముందు… ప్రచారం తర్వాత ఉన్న పరిస్థితులపై చర్చించారు. ఆర్థికాంశాలపై కూడా ఫోకస్ పెట్టారని, అందుకోసమే… ఉత్తమ్ చంద్రబాబుల మీటింగ్ కు ముందు చంద్రబాబు– కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ల భేటీ కూడా అందులో భాగమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక, కీలకమైన మైనారిటీల ఓట్ల కోసం… చంద్రబాబు, ఆజాద్, డీకే శివకుమార్ లు ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
Leave a Reply