టీఆర్ఎస్ కు ద‌గ్గ‌ర‌గా బీజేపీ… కూట‌మీకి ఓకే.

Read Time: 1 minutes

ఫ‌లితాల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో… రాష్ట్రంలో కొత్త పొత్తుల‌కు ఆస్కారం ఏర్ప‌డుతోంది. హంగ్ వ‌చ్చే ప‌రిస్థితులు ఉంటాయ‌న్న ఆందోళ‌న‌లో ఉన్న ప్ర‌ధాన పార్టీలు ఎవ‌రికి వారు కొత్త నేస్తాల కోసం అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల‌కు తెర‌తీస్తున్నారు. అయితే, ఎన్నిక‌లకు ముందు మేం ఓంట‌రిగా వెళ్తున్నాం అని చెప్పుకొచ్చిన బీజేపి… వ‌చ్చే ప్ర‌భుత్వంలో చేరాల‌న్న ఆశ‌తో క‌న‌ప‌డుతోంది.

కాంగ్రెస్ కూట‌మికి పోటీగా టీఆర్ఎస్ కూట‌మి క‌ట్టే అవ‌కాశం ఎంత‌వ‌ర‌కు ఉంద‌న్న అంచ‌నాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్–టీడీపీ– సీపీఐ-టీజెఎస్ కూట‌మి ఎన్నిక‌ల ముందే జ‌త క‌ట్టింది. ఇప్పుడు ఈ కూట‌మికి ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌ని వారు అంచ‌నా వేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ఓంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెళ్లింది. టీఆరెఎస్ కు ఒంట‌రిగా అధికారంలోకి వ‌చ్చేందుకు పూర్తిస్థాయి మెజారిటీ రాకుంటే, ఎంఐఎం మ‌ద్ద‌తును కోరుకుంటుంది. అయితే… ఎంఐఎం నేరుగా టీఆర్ఎస్ తో ప్ర‌భుత్వంలో చేరే అవ‌కాశం లేదు. అయితే… ఎంఐఎంతో స‌మానంగా బీజేపీ సీట్లు సాధిస్తే  టీఆర్ఎస్–బీజేపీ జ‌త‌క‌ట్టే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. బీజేపి ఇప్ప‌టికే స్నేహ హ‌స్తం అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

బీజేపి… క‌నీసం 7 సీట్లు వ‌స్తాయ‌న్న కృత‌నిశ్చ‌యంతో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం గ్రేట‌ర్ కే ప‌రిమితమైన ఆ పార్టీ ఇప్పుడు ఇత‌ర జిల్లాల్లో కనీసం 4 స్థానాలు ద‌క్కించుకుంటామ‌ని ధీమాగా ఉంది. దీంతో… తెలంగాణ‌లో టీఆర్ఎస్ తో పోస్ట్ పోల్ అలయ‌న్స్ కు ఆరాట‌ప‌డుతోంది. త‌ద్వారా త‌మ‌కు ద‌క్క‌క‌పోయినా… మా చేతుల్లోనే తెలంగాణ ఉంద‌ని, ద‌క్షిణాదిలో ఖాతా తెర్చిన‌ట్లేన‌ని దేశానికి మెసెజ్ ఇచ్చేందుకు ఊవ్విళ్లూర‌బోతుంది. ఇందుకు బీజేపి కేంద్ర నాయ‌క‌త్వం కూడా సుముఖంగా ఉంద‌ని తెలుస్తోంది. అయితే… కేసీఆర్ దీనిపై ఆచితూచి  స్పందిస్తున్నారు. స‌మాన‌మైన సీట్లు వ‌చ్చి,  బీజేపీ–ఎంఐఎం అవ‌స‌రాలు ఉండేలా ఉంటే మాత్రం కేసీఆర్ ఎంఐఎంతోనే వేళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌నున్నారు. ఇందుకు బీజేపీ కూడా ఒప్పుకోనుంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే… కేసీఆర్, బీజేపి ఒక్క‌టైతే, కాంగ్రెస్ నాయ‌క‌త్వం మ‌జ్లిస్ ను ద‌గ్గ‌ర‌కు తీసుకుంటే త‌మ‌కు ఇబ్బందేన‌ని కేసీఆర్ ఆలోచిస్తున్నార‌ట‌. అందుకే… మ‌జ్లిస్ ను వీలైనంత మేర త‌మ వ‌ద్దే ఉంచుకునేలా కేసీఆర్ ఎత్తుగ‌డ వేసే అవ‌కాశం ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇలా కేసీఆర్ ఇప్ప‌టి నుండే కౌంటింగ్ డే నాటి ప‌రిస్థితుల‌ను అంచనా వేస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*