టీఆర్ఎస్ ను గెలిపించే బాధ్య‌త చంద్ర‌బాబుకు అప్ప‌గిస్తోన్న కేసీఆర్.

Read Time: 1 minutes

చంద్రబాబు… టీఆర్ఎస్ ను గెలిపిస్తారా… అదేంటీ అనుకుంటున్నారా…? అవును. చంద్ర‌బాబు మాత్ర‌మే టీఆర్ఎస్ ను గట్టెక్కించ‌గ‌ల‌డని ఆ పార్టీ నేత‌లు గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. చంద్ర‌బాబు త‌ప్పా… టీఆర్ఎస్ గెలుపుకు కేసీఆర్ కూడా స‌రిపోర‌ని విశ్వ‌సిస్తున్నారు.

2014 ఎన్నిక‌లు వ‌చ్చే వ‌ర‌కు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కు… ఆ పార్టీకి కొండంత అండ కేసీఆర్, తెలంగాణ సెంటిమెంట్. కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల భావోద్వేగాల‌ను చ‌ల్ల‌రానివ్వ‌కుండా, సెంటిమెంట్ కంటిన్యూ అయ్యేలా చూసుకున్నారు. ఓడిదుడుకులు వ‌చ్చినా… సెంటిమెంట్ చూట్టూనే టీఆర్ఎస్ కారును న‌డిపించారు కేసీఆర్. కానీ ఓ సారి అధికారంలోకి వ‌చ్చాక అభివృద్ది ప‌థ‌కాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు  జ‌నం ప‌ట్టం క‌ట్టాలి. కానీ… ఆ కార్య‌క్ర‌మాలు కేసీఆర్ ను మరోసారి సీఎం ఖుర్చీ ఎక్క‌నిచ్చే ప‌రిస్థితులు లేవు. అందుకే… ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు ఓట్లు రావాలంటే, చంద్ర‌బాబును కొట్టేపనిలో ఉంది టీఆర్ఎస్. చంద్ర‌బాబు తెలంగాణ ద్రోహీ అని, ఆయ‌న తెలంగాణ‌కు అడ్డం ప‌డ్డ‌ర‌ని… అలాంటి వ్య‌క్తి ఉన్న కూట‌మికి ఓటేస్తే.. మ‌ళ్లీ స‌మైక్య రాష్ట్రం ఏర్పాటు చేస్తారంటూ… టీఆర్ఎస్ మ‌రోసారి భావోద్వేగ ప్ర‌క‌ట‌న‌ల‌కు వ్యూహం వేసింది. మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్ ను తీయ‌గ‌లిగితే… గెలుపు న‌ల్లేరు పై న‌డ‌కేన‌ని కేసీఆర్ న‌మ్ముతున్నారు. చంద్ర‌బాబును తిట్టే భాద్య‌త‌ను హ‌రీష్ కు అప్ప‌గించి… 2014కు ముందు, టీడీపీ–కాంగ్రెస్ పార్టీల స‌మైక్యాంద్ర నేత‌ల పాత వీడియోలు, పేప‌ర్ క‌టింగ్ ల‌తో హ‌రీష్ నిప్పులు చేర‌గ‌టం అందులో భాగమేన‌ని రాజ‌కీయ  పండితులు విశ్వ‌సిస్తున్నారు.

కానీ… నాడు సెంటిమెంట్ కు ప్రాణ వాయువులుగా ఉన్న విద్యార్థులు ఇప్పుడు టీఆర్ఎస్ పంచ‌న లేరు. టీఆర్ఎస్ కు వాత పెట్టేందుకు విద్యార్థి, నిరుద్యోగులే ముందుగా ఎదురుచూస్తున్నారు. మ‌మ్మ‌ల్నీ మోసం చేశార‌ని ఆ వ‌ర్గం ఆగ్ర‌హంతో ఉంది. ప్ర‌స్తుతం పెల్లుబెక్కుతోన్న నిర‌స‌న జ్వాల‌లు ఆ వ‌ర్గానివే. ఎక్క‌డో ఓ మూల చంద్ర‌బాబు వ్య‌తిరేక  బీజాలున్న ఆ వ‌ర్గం… కొంతైన మారుతుంద‌ని, వారికి తోడు… ఇత‌ర వ‌ర్గాల‌ను సెంటిమెంట్ అస్త్రం ట‌చ్ చేయ‌గ‌లిగితే… చాల‌ని యోచిస్తోంది టీఆర్ఎస్.

చూడాలి మ‌రీ… టీఆరెఎస్ ను గెలిపించే బాద్య‌త చంద్ర‌బాబు ఎంత‌మేర‌కు నేర‌వేరుస్తారో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*