తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు….

Read Time: 0 minutes

కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాలు… ఎన్నో వివాదాల‌కు, కోర్టుల్లో అక్షింత‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయి. కేసీఆర్ ప్ర‌జా నాడిని ప‌ట్టేందుకు స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకే మొగ్గుచూపినా, రిజ‌ర్వేష‌న్ల అంశంలో రాజ‌కీయ ల‌బ్ధికి ప్ర‌య‌త్నించి… ఎదురుదెబ్బ తిన్నాడు.

అధికార పార్టీ హోదాలో స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌కు వెళ్లి… ప్ర‌జా నాడిని ప‌ట్టాల‌ని, త‌ద్వారా ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లాలా వ‌ద్దా అన్న నిర్ణ‌యంలో కేసీఆర్… స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌కుండా, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కే మొగ్గుచూపారు. అయితే, అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రిజ‌ర్వేష‌న్ల‌ను 50శాతం నుండి 67శాతానికి పెంచేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ హైకోర్టు నో చెప్ప‌టంతో కేసు పెండింగ్ లో పెట్ట‌గా, కేసీఆర్ ముంద‌స్తుకే మొగ్గుచూపారు. ఆ త‌ర్వాత కోర్టు 2 నెల‌ల గ్యాప్ లో ఎన్నిక‌లు పెట్టాల్సిందేన‌ని తీర్పు ఇచ్చింది. ఇప్ప‌టికే నెల స‌మ‌యం కూడా గ‌డిచిపోయింది. అయితే… రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీం త‌లుపుత‌ట్టినా, తెలంగాణ స‌ర్కార్ కు ఫ‌లితం లేదు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ 50శాతానికి రిజ‌ర్వేష‌న్లు మించ‌కూడ‌ద‌ని తేల్చి చెప్పింది. కేంద్రంతో స‌ఖ్య‌త గా ఉన్న‌కేసీఆర్ కూ మోడీ ఈ విష‌యంలో ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌టం లేదు.

అయితే, ముంద‌స్తు ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వెంట‌నే… గ్రామాల్లో మ‌ళ్లీ ఎన్నిక‌ల కోలాహాలం రాబోతుంది. అధికారంలోకి వ‌చ్చిన పార్టీకి కాస్త ఎడ్జ్ ఉండే అవ‌కాశం ఉన్నా, గ్రామ స్థాయి ఎన్నిక‌లు పూర్తిగా స్థానిక ప‌రిస్థితులు, అబ్య‌ర్థుల ఆధారంగా ఉంటాయి కాబ‌ట్టి… ఇప్పుడు ఇక మ‌ళ్లీ మైక్ లు మొద‌ల‌వ‌బోతున్నాయి.

సో… కేసీఆర్ కు ఓ ర‌కంగా ఎదురుదెబ్బే.  అయితే… తెలంగాణ‌లో కేసీఆర్ యేత‌ర ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే… కేసీఆర్ వేసిన రిజ‌ర్వేష‌న్ల చిక్కుముడి వారికీ ఓ రకంగా ఇబ్బందే అయినా…. కేసీఆర్ పై ఆ పాపాన్నిపెట్టి త‌ప్పించుకునే ఆస్కారం కూడా క‌ల్పించిన‌ట్ల‌యింది. తేనే తుట్టే లాంటి రిజ‌ర్వేష‌న్ల అంశం, కేసీఆర్ యేత‌ర ప్ర‌భుత్వానికి ఆ సానుకూల అంశం క‌ల్పించిన‌ట్లే అవుతుంది

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*