దటీజ్ మహంతి ఫ్యామిలి… నాటి నుండి నేటి వరకు.

Read Time: 1 minutes

ఐపీఎస్ మహాంతి. ఈ పేరంటే ఓ బ్రాండ్ ఉంది. అవి 2009 ఎన్నికలు. నాటి సీఎం వైయస్ ఎన్నికల ముందు పోలీస్ బాస్ గా ssp యదవ్ ను నియమించాడు. కానీ ఎన్నికలు సజావుగా సాగవన్న ఉద్దేశంతో… అప్పటి ఎన్నికల కమిషనర్ ఐ వి సుబ్బారావు… ఎన్నికల ప్రక్రియ మొదలుకాగానే యాదవ్ పై వేటు వేసి, మహాంతి ని పోలీస్ బాస్ చేశారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి ఏ మాత్రం లొంగకుండా, నిక్కచ్చిగా వ్యవహరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిచేశారు.

ఇప్పుడు కూడా అలాంటి సీన్ రిపీట్ అయింది. నాటి మహాంతి కొడుకు కూడా ఐపీఎస్. ఇటీవలి కొడంగల్ రాజకీయ దుమారం లో వికారాబాద్ ఎస్పీ పై వేటు వేసింది ఈసీ. రేవంత్ రెడ్డి విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిందని…. వేటు వేసి, సీసీఎస్ లో ఉన్న జూనియర్ మహాంతి ని వికారాబాద్ ఎస్పీ గా వేసింది. అర్ధరాత్రి ఆయన బాధ్యతలు స్వీకరించారు. తండ్రి లాగే…. జూనియర్ మహంతి కూడా ఫుల్ స్ట్రిక్ట్ ఆఫీసర్. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

కొడంగల్ లో హింస జరిగే అవకాశం ఉందని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగే అవకాశం లేదని ఈసీ ఇప్పటికే ప్రకటించింది. రెండు వర్గాలు కూడా హోరాహోరీగా ఉన్నాయి. దింతో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల కోసం నేరుగా కేంద్ర ఎన్నికల సంఘమే జోక్యం చేసుకొని, అవినాష్ మహంతికి బాధ్యతలు ఇచ్చారు. తండ్రి కొడుకులకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల బాధ్యత ఇవ్వటం…. అనేది హానర్ అని, అరుదుగా వచ్చే గుర్తింపని అంటున్నారు విశ్లేషకులు.

చూడాలి మరీ…. కొడంగల్, వికారాబాద్ ఎన్నికల  డ్యూటీలో అవినాష్ మహాంతి ఎంతవరకు సక్సెస్ అవుతారో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*