నాకూ పెళ్ళి కావాలంటున్న మరో బాలీవుడ్ భామ…. పెండ్లికీ పోటీయే.

Read Time: 0 minutes

సినిమాలు, ప్రమోషన్స్ లో ఎప్పుడూ పోటాపోటీగా ఉండటం బాలీవుడ్ భామలకు అలవాటే. అన్ని విషయాల్లో నూ పోటీ పడే ఈ భామలు పెండ్లి విషయంలోనూ వెనక్కి తగ్గటం లేదు. నిన్నటి వరకు తనతో పోటీపడ్డ హీరోయిన్లు హ్యాపీగా భర్తలతో ఎంజాయ్ చేస్తున్నారు, నేను చేయొద్దా అనుకున్నదో ఏమో కత్రినా కైఫ్ మనసు కూడా ఇప్పుడు పెండ్లి పై పడింది.

కొంతకాలంగా….  బాలీవుడ్ లో పెళ్లిల్ల సీజన్ నడుస్తోంది. విరాట్ తో ప్రేమాయణం తర్వాత  అనుష్క శర్మ, నేహా ధుపియా, సోనమ్ లు…. రీసెంట్ గా దీపిక రీసెంట్,  ప్రియాంక ఇలా పెండ్లిళ్ళు చేసుకొని సెటిల్ అయిపోయారు.  ఇప్పుడు  కత్రినా కైఫ్ వంతు వచ్చేసింది. నాకూ పెళ్లి చేసుకోవాలని ఉందంటూ బయట పెట్టేసింది. ఇప్పటికే పలు ప్రేమయణలు నడిపిన కత్రినాకైఫ్…. ఎం రాసిపెట్టి ఉందొ అదే అయితుంది. నా విషయంలో దేవుడు ఎం చేస్తాడో చూడలంటూ పేర్కొంది. గతం లో రణబీర్ తో ప్రేమలో మునిగి తెలిపోయిన కత్రీనా, ముంబయి లో సెపరేట్ రూమ్ తీసుకొని మరి… గడిపారు. కానీ రణబీర్ తో బ్రేక్ అప్ తర్వాత సింగల్ గానే ఉంటోంది. కానీ బ్రేకప్ తర్వాత వేదాంత ధోరణిలో ఉన్న కత్రినా అదే తరహాలోనే పెళ్లి విషయం పై ఓ ఇంటర్వ్యూ లో మనసు విప్పి మాట్లాడింది. మనకు ఏదైతే నిర్ధారితమై ఉంటుందో అదే చేస్తుంటాం. ఈ విషయం గ్రహించిన తరువాత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. మనకు వచ్చిన ఆలోచనలన్నీ సాకారం కావు అంటూ తెలిపింది.

రణబీర్ మాత్రం… అలియా భట్ తో డేటింగ్ లో ఉన్నాడని బాలీవుడ్  టాక్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*