నా ప‌రువు పోత‌ది… మా పార్టీనే గెలిపించండ‌ని బ్ర‌తిమాలుతోన్న తుమ్మ‌ల‌.

Read Time: 0 minutes

ఖ‌మ్మం టీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్ రావు ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఖ‌మ్మంలో బ‌ల‌మైన మ‌హ‌కూట‌మిని ఎదుర్కొనేందుకు సెంటిమెంట్ నే ప్ర‌ధానంగా న‌మ్ముకుంటూ, పార్టీ అబ్య‌ర్థుల గెలుపుకు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.

ఖ‌మ్మంలో… తెలుగుదేశం పోటీలో ఉన్న స్థానాల్లో ఓడించండి, ఆ బాధ్య‌త మీరే తీసుకోవాలంటూ తుమ్మ‌ల‌కు బాధ్య‌త అప్ప‌జెప్పారు కేసీఆర్. ఇప్ప‌టిక స‌త్తుప‌ల్లిలో టీఆర్ఎస్ జెండా ఎగురేవేయిస్తా అని మాట ఇచ్చిన తుమ్మ‌ల‌కు, కేసీఆర్ కొత్త బాధ్య‌త త‌ల‌నొప్పిగా మారోతుంది. ముఖ్యంగా అశ్వారావు పేట టీఆర్ఎస్ అబ్య‌ర్థి  తాటి వెంక‌టేశ్వ‌ర్రావు పై తీవ్ర వ్య‌తిరేకత ఉంది. ఆయ‌న పార్టీ మార‌టం, ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌నే కోపం ప్ర‌జ‌ల్లో ఉండ‌టంతో…. తుమ్మ‌ల‌కు ఇప్పుడు టెన్ష‌న్  నెల‌కొంది.

మీ ఎమ్మెల్యేపై కోపం ఉంది. ఆ కోపం నామీద‌, ఎంపీ మీద కూడా ఉంద‌ని తెలిసింది… కానీ ఈ ఒక్క‌సారి ఆ కోపం చూపించ‌కండి అంటూ తుమ్మ‌ల అశ్వర్రావు పేట ప్ర‌జ‌ల‌ను వేడుకుంటున్నారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌ను బుజ్జ‌గిస్తూ… కోపం ఉంటే భారీ మెజారిటీ రావాల్సిన ప‌నిలేదు. కానీ క‌నీసం నాలుగైదు వేల మెజార్టీతో అయినా గెలిచేలా ఓటేయండి.  ఈ ఒక్క‌సారి కోపం చూపించ‌కండి అంటూ తుమ్మ‌ల అక్క‌డి ప్ర‌జానీకాన్ని, కార్య‌క‌ర్త‌ల‌ను బుజ్జ‌గిస్తున్నారు. ఖ‌మ్మం ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకొని,  32 ఏండ్లుగా మీతోనే ఉన్నాన‌ని… నా రాజ‌కీయా జీవితం చివ‌ర్లో నా త్యాగానికి విలువ ఇచ్చి… నా కోస‌మైనా తాటి వెంక‌టేశ్వ‌ర్లును గెలిపించాల‌ని వేడుకుంటున్నారు.

దీంతో… అక్క‌డున్న ఉద్యమ టీఆర్ఎస్ నాయ‌కులు, అశ్వ‌ర్రావు పేట టీఆర్ఎస్ లోని ఓ వ‌ర్గం చూసి న‌వ్వుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఎలాంటి నాయ‌కుడికి, ఎంత గ‌తి ప‌ట్టింద‌ని విమ‌ర్శిస్తున్నారు. మ‌రోవైపు అశ్వ‌ర్రావు పేట‌లో టీడీపీ కూట‌మి నుండి త‌మ అబ్య‌ర్థిని బ‌రిలోకి దింపింది.

ఇప్ప‌టికే… ఖ‌మ్మం జిల్లాలో  అనేక వ‌ర్గాలుగా విడిపోయిన టీఆరెఎస్ కు అక్క‌డి స‌ర్వేలు భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నాయ‌ని, అందుకే నోటికి ప‌నిచెప్పి… బూతులు మాట్లాడే తుమ్మ‌ల సైతం ప్ర‌జ‌ల‌ను వేడుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని విమ‌ర్శిస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*